ఆ తర్వాత ప్రదీప్ పక్కకు వెళ్లి అతడి చేతులు గట్టిగా పట్టుకుని నిలబడింది. ఇదంతా చూస్తున్న నెటిజన్స్.. వామ్మో వీళ్ళ వ్యవహారం మామూలుగా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ప్రదీప్, శ్రీముఖి పెళ్లి చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మళ్లీ తాజాగా ఐ లవ్ యూ అంటూ కొత్త అనుమానాలు దారి తీసింది శ్రీముఖి.
దీనిలో ఇప్పటికే ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అంటూ నటసింహా నందమూరి బాలకృష్ణతో ‘అన్స్టాపబుల్ విత్ యన్బికె’ అనే షో ను అనౌన్స్ చేసి వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. అన్స్టాపబుల్ లో ఇప్పటికే రెండు ఎపిసోడ్ లు పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు గెస్ట్ గా వస్తే.. రెండో ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నాని.. గెస్ట్ గా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. ఆహాలోనే ‘సర్కార్’ అనే కొత్త షోను తీసుకొచ్చారు. దీనికి ‘మీ పాటే నా ఆట’ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ షోకి పార్ట్ నర్ గా గేమింగ్ యాప్ ఫన్ 88 భాగస్వామ్యంగా ఉంది. దీనికి యాంకర్ గా ప్రదీప్ హోస్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ 28 నుండి ఈ షో స్ట్రీమింగ్ చేయబడుతోంది. ఇప్పటికే దీనిలో మూడు ఎపిసోడ్ లు పూర్తయ్యాయి.
అలీ కూడా తనను మోసం చేశావ్ అంటూ.. అదోరకంగా ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు. ఇలా అలీకి సపోర్టు పలకకుండా.. మధుకు సపోర్టు చేయడంతో మధు అమౌంట్ రూ.2.95 లక్షలతో రెండో ప్లేస్ లో ఉంటాడు. ప్రవీణ్ మొదటి ప్లేస్ లో ఉండగా.. మూడో స్థానంలో ఉన్న అలీ వద్ద రూ.2 లక్షలు మాత్రమే ఉంటాయి. ఈ గేమ్ షోలో చివరకు ప్రవీణ్ విన్నర్ గా నిలుస్తాడు. ఇలా ఈ షో అంతా ఆధ్యంతం కామెడీతో ఉత్కంఠగా ముందుకు సాగుతుంది. (Image Credit : Facebook)