Nbk 107: బాలయ్య 107 సినిమా నుంచి షాకింగ్ న్యూస్... ఏం జరిగిందంటే..!
Nbk 107: బాలయ్య 107 సినిమా నుంచి షాకింగ్ న్యూస్... ఏం జరిగిందంటే..!
నందమూరి బాలకృష్ణ కెరీర్ 107 వ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ షూటింగ్, హఠాత్తుగా బాలకృష్ణకి కరోనా పాజిటివ్ కారణంగా కొన్నాళ్ళు వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా నుండి పూర్తిగా కోలుకున్న బాలకృష్ణ ఈ నెల 9 నుండి మళ్ళి రెగ్యులర్ గా షూట్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ మూవీ టీమ్ లో కీలక సబ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో షూట్ మరికొన్నాళ్లు వాయిదా పడనున్నట్లు తెలిసిందే.
గతేడాది చివర్లో బాలయ్య.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ (Akhanda)సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ సక్సెస్ తర్వాత బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు.
2/ 8
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభమైంది అక్కడ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. రీసెంట్గా ఈ సినిమా రెండో షెడ్యూల్ కూడా సిరిసిల్లలో ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభమైంది. అయితే ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటంతో.. షూటింగ్‌కు బ్రేక్ పడింది.
3/ 8
ఇటీవల శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్, హఠాత్తుగా బాలకృష్ణకి కరోనా పాజిటివ్ కారణంగా కొన్నాళ్ళు వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా నుండి పూర్తిగా కోలుకున్న బాలకృష్ణ ఈ నెల 9 నుండి మళ్ళి రెగ్యులర్ గా షూట్ లో పాల్గొనాల్సి ఉంది.
4/ 8
అయితే ఈ మూవీ టీమ్ లో కీలక సబ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో షూట్ మరికొన్నాళ్లు వాయిదా పడనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్ అని, అలానే షూట్ లో సభ్యులు కోలుకున్న అనంతరం మళ్ళి షెడ్యూల్ ని వీలైనంత త్వరలో ప్రారంభించేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
5/ 8
ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో దునియా విజయ్.. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలయ్యకు సంబంధించిన రెండు లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
6/ 8
ఈ సినిమాలో లేడీ విలన్‌గా పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ను తీసుకున్నారు.ఇక గతేడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్’లో జయమ్మగా వరలక్ష్మి అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు బాలయ్య సినిమాలో హీరోను ఢీ కొట్టే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది.
7/ 8
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ప్రఖ్యాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
8/ 8
ఈ సినిమాకు ‘పెద్దాయన,’ తో పాటు అన్నగారు, వేట పాలెం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు ‘రెడ్డిగారు’ అనే మరో పేరు పరిశీలనకు వచ్చింది. మరి బాలయ్య సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.