Shankar - Ram Charan: ప్రస్తుతం రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాల తరువాత పలు అవకాశాలు కూడా అందుకుంటున్నాడు చరణ్. ఇక మరో క్రేజీ డైరెక్టర్ శంకర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు చరణ్. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనుంది. అంతేకాకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు శంకర్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు అది కూడా 60 కోట్లకుపైగా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే.