ఈ సినిమా రెండవ పార్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అవతార్ 2” (Avatar 2) విడుదలకు సిద్ధమవుతోంది. 'అవతార్'కు సీక్వెల్‌గా వస్తున్న మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (Avatar: The Way of Water ).ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. (Twitter/Photo
అయితే ఇప్పుడు మేకర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అయ్యేలా... అవతార్ 2 కు టికెట్స్ బుకింగ్ జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొదటగా కేవలం కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రీమియం టికెట్స్ ఓపెన్ చేయగా మొత్తం 45 స్క్రీన్స్ కి బుకింగ్స్ ఓపెన్ చేశారు.మూడు రోజుల్లో ఏకంగా 15000 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. Avatar 2 Trailer Photo : Twitter
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2.2 బిలియన్ డాలర్లు వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని అవతార్-2 చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో ఓ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం ఓ రికార్డు అని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే గతంలో వచ్చిన అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.2.9 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.