Shivani Rajasekhar | తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ కాకుండా.. నేరుగా డిస్నీ హాట్ స్టార్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. (Instagram/Photo)
తాజాగా శివానీ రాజశేఖర్ తన తండ్రి హీరోగా రాజశేఖర్ ముఖ్యపాత్రలో నటించిన ‘శేఖర్’ సినిమాలో నటించింది. ఈయన విషయానికొస్తే.. కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. తాజాగా ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ స్క్రీన్ షేర్ చేసుకుంది. (Instagram/Photo)
తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. ఇక హీరోగా వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘PSV గరుడవేగ’ (PSV Garudavega) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కారు రాజశేఖర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించారు. (Instagram/Photo )
తెలుగు సినీ ఇండస్ట్రీలో నిజ జీవితంలో తండ్రి కూతుళ్లైన వీళ్లిద్దరు సినిమాలో కూడా తండ్రి కూతుళ్ల పాత్రలోనే నటించినట్టు ఈ స్టిల్ చూస్తుంటే తెలుస్తోంది. గతంలో నాగబాబు.. నిహారిక ఓ వెబ్ సిరీస్లో నిజ జీవిత పాత్రలో నటించడం విశేషం. ఇపుడు రాజశేఖర్.. తన లేటెస్ట్ మూవీ ‘శేఖర్’లో కూతురుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను జీవితా రాజశేఖర్ డైరెక్ట్ చేయడం గమనార్హం. (Instagram/Photo)
ఆ మధ్య కరోనా బారినపడి.. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ కోలుకున్నారు. ఇక ఆయన బర్త్ డే సందర్భంగా ‘శేఖర్’ అనే కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా లుక్ను విడుదల చేసారు. ఈ సినిమాను లలిత్ అనే కొత్త దర్శకుడుతో ప్రారంభమైన జీవితా రాజశేఖర్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాను వేరే నిర్మాతలతో కలిసి రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మిక నిర్మించారు. (Instagram/Photo)