తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ కాకుండా.. నేరుగా డిస్నీ హాట్ స్టార్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. (Instagram/Photo- Shivani)
రీసెంట్ గా ఈమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అదే రోజు ఆమె డాక్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండటంతో తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది. (Instagram/Photo- Shivani)
తాజాగా శివానీ రాజశేఖర్ తన తండ్రి హీరోగా రాజశేఖర్ ముఖ్యపాత్రలో నటించిన ‘శేఖర్’ సినిమాలో నటించింది. ఈయన విషయానికొస్తే.. కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నున్నా...హిట్ లు ,ప్లాప్ లు లెక్కచేయకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తున్న హీరో రాజశేఖర్. తాజాగా ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ స్క్రీన్ షేర్ చేసుకుంది.(Instagram/Photo- Shivani)