Shivani Rajasekhar | తెలుగు ఇండస్ట్రీలో వారసులు ఎక్కువగా ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువే. హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తండ్రి రాజశేఖర్ హీరోగా తల్లి జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శేఖర్’ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో నటించింది. రీసెంట్ గా ఈమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
శివానీ రాజశేఖర్ విషయానికొస్తే.. ‘అద్భుతం’సినిమాతో అందర్నీ మెప్పించింది. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ వేదికగా విడుదలై మంచి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత www సినిమాలో తన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. రీసెంట్గా తండ్రి శేఖర్ టైటిల్‌తో నటించిన సినిమాలో రియల్ లైఫ్ కూతురు పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం శివాని మరో రెండు సినిమాల్లో చేస్తుంది. ఇందులో ఒక తమిళ్ సినిమా కూడా ఉంది.
జూలై 3న శివానీ ఫెమినా మిస్ ఇండియా కంటెస్ట్ రోజునే.. ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎక్సామ్ అదే రోజున ఉన్నందున ఈ పోటీలో పాల్గొనలేకపోతున్నాను అంటూ కాస్తంత బాధగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన జీవితంలో ఫెమినా మిస్ ఇండియా కంటే .. ఒక డాక్టర్ కావాలనదే తన కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టింది. (Instagram/Photo)
శివానీ రాజశేఖర్ ఫెమినా మిస్ ఇండియా పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె సన్నిహితులు, అభిమానులు కాస్త నిరాశకు లోనైనా.. డాక్టర్ చదువు కోసం ఫెమినా మిస్ ఇండియా లాంటి కంటెస్ట్స్కు దూరంగా ఉండటం పెద్ద విషయం కాదు. అంతేకాదు శివానా త్వరలో డాక్టరేట్ పట్టా పుచ్చుకోవాలని అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది చెబుతున్నారు. (Instagram/Photo)