Raj Kundra - Sanjay Dutt | పోర్న్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్డు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలసిందే కదా. రాజ్ కుంద్రా కంటే ముందు బాలీవుడ్‌కు చెందిన ఈ నటీనటులు పలు కేసుల్లో జైలుకు వెళ్లారు. కొంత మంది బెయిల్‌పై విడుదలైయితే...మరికొంత మంది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంతకీ జైల్లో చిప్పకూడు తిన్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..
బాలీవుడ్లో ప్రస్తుతం రాజ్ కుంద్రా వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయా అని అంతా వణికిపోతున్నారు. ముంబైలో పోర్నోగ్రఫీ రాకెట్ ఇంతగా పెరిగిపోయిందా.. ఈ స్థాయిలో పాకిపోయిందా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తంగా ఈ కేసు పుణ్యామా అంటూ రాజ్ కుంద్రా జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన కంటే ముందు పలువురు సినీ నటులు జైలు జీవతం గడిపారు.