ఈ రోజుల్లో సగం షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు కూడా ఆగిపోతున్నాయి. అలాంటిది అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోవడం ఓ లెక్కా..? కానీ స్టార్ హీరోలు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తైపోతాయి అంటుంటారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం అలా జరగలేదు. కొన్ని సినిమాలు అధికారికంగా అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోతుంటాయి. స్టార్ హీరోలున్న సినిమాలకు కూడా ఒక్కోసారి ఈ తిప్పలు తప్పవు.
మరీ ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు సైతం అధికారికంగా ప్రకటించి.. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయాయి. అలా వర్మతో చిరంజీవి సినిమా ఉంది.. బి గోపాల్‌తో బాలయ్య సినిమా ఉంది.. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఉన్నాయి. అనివార్య కారణాలతో ఈ సినిమాలు పట్టాలెక్కకుండానే అటకెక్కాయి. అసలు ఆ సినిమాలేంటి.. ఎప్పుడు ఆగిపోయాయి అనేది చూద్దాం..