షావుకారు జానకి- కృష్ణకుమారి | అలనాటి తారలు జానకి, కృష్ణకుమారి.ఇందులో జానకి అక్క, కృష్ణకుమారి చెల్లెలు. వీరిద్దరు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కృష్ణకుమారి ఈ లోకాన్ని విడువగా జానకి తెలుగులో బాబు బంగారం, సౌఖ్యంతో పాటు కార్తి హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ ‘దొంగ’ సినిమాలో చివరగా నటించింది. తాజాగా షావుకారు జానకికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. (File/Photo)
షావుకారు సినిమాతో నటిగా తొలిసారి వెండితెరపై హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో శంకరమంచి జానకి కాస్తా.. ఈ సినిమాతో షావుకారు జానకిగా మారిపోయింది. అంతేకాదు హీరోగా ఎన్టీఆర్ ‘మన దేశం’తో పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆయనకు హీరోయిన్ లేదు. ఇక ఎన్టీఆర్ సరసన నటించిన మొట్ట మొదటి హీరోయిన్గా షావుకారు జానకి రికార్డులకు ఎక్కారు. (File/Photo)
హీరోయిన్గా సావిత్రి సహా ఎంతో మంది నటీమణుల కంటే సీనియర్ షావుకారు జానకి. 18 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చిన ఈమె 90 యేళ్లు దాటినా.. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుంచి కలర్ చిత్రాలు మధ్యలో డిజిటల్ వరకు నటించిన నటి. ఒకప్పుడు ఎన్టీఆర్ సరసన నటించిన ఈమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటి యువ హీరోలకు వరకు తల్లిగా, అమ్మమ్మగా.. నానమ్మగా నటించింది. (File/Photo)
జానకి ‘షావుకారు’ సినిమాలో నటించే సమయానికి 18 యేళ్లతో పాటు ఒక బిడ్డకు తల్లి. ఇక ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతుంటే దర్శక, నిర్మాత బి.ఎన్.రెడ్డి రికమండేషన్‌తో ఆమెకు షావుకారు చిత్రంలో అవకాశం వచ్చింది. ఇక జానకి రెండో చిత్రం ‘ముగ్గురు కొడుకులు’. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈమె ఒక మగ బిడ్డకు జన్మినిచ్చారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా.. స్వయంకృషితో హీరోయిన్గా ఎదిగారు. అప్పట్లో కే.బాలచందర్‌తో కలిసి రాగిణి క్రియేషన్ సంస్థతో కలిసి తమిళంలో కొన్ని నాటకాలు ప్రదర్శించారు.
తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని.. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్, కన్నడలో రాజ్‌కుమార్‌ల సరసన నటించింది. ఈమెకు ‘షావుకారు’తో పాటు ‘వద్దంటే డబ్బు, సొంతఊరు, కన్యాశుల్కం, రోజలు మారాయి, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, అక్కా చెల్లెల్లు సినిమాలు బాగా పేరు తీసుకొచ్చాయి. ఈమె బాటలోనే ఆమె చెల్లెలు కృష్ణకుమారి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. అక్కను మించి చెల్లెలుగా పేరు గడించింది. సినీ ఇండస్ట్రీలో అక్కా చెల్లెల్లు హీరోయిన్లుగా స్టార్ డమ్ అందుకున్నది మొదటి వీళ్లే. ఆ తర్వాత వీళ్ల బాటలో ఎంతో మంది హీరోయిన్స్.. తమ చెల్లెల్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసారు. (File/Photo)
నూతన్ - తనూజా | తెలుగులో షావుకారు జానకి, కృష్ణకుమారి లాగే బాలీవుడ్లో అక్కా చెల్లెళ్లైన నూతన్, తనూజా ఇద్దరూ టాప్ హీరోయిన్లుగా సత్తా చాటారు. వీళ్లిద్దరి తల్లి శోభన సమర్ధ్ కూడా బాలీవుడ్ కథానాయిక. వీళ్లిద్దరు.. 1950లో తెరకెక్కిన ‘హమారి బేటి’తో పాటు 1960లో తెరకెక్కిన 1960లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. ఇక శోభన సమర్ధ్ తల్లి రత్నాబాయి కూడా బాలీవుడ్ తొలి తరం కథానాయిక. ఇక తనూజా ఇద్దరు కూతుళ్లు కాజోల్, తనీజా ముఖర్జీ బాలీవుడ్ హీరోయిన్లు. వీరిలో కాజోల్ బాలీవుడ్ నెంబర్ వన్ కథానాయికగా ఎన్నో ఏళ్లు తెరను ఏలింది. అటు నూతన్ తనయుడు మోనీష్ బెహల్ .. బాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా సత్తా చూపిస్తున్నారు. (File/Photo)
కాజోల్ దేవ్‌గణ్ - తనీషా ముఖర్జీ | కాజోల్ దేవ్‌గణ్ బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా సత్తా చాటింది. ఆమె చెల్లెలు అక్క బాటలో తనీషా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసినా.. కథానాయికగా లక్ కలిసి రాలేదు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయడంతో ఈమె పేరు మారుమోగిపోయింది. (File/Photo)
మలైకా అరోరా - అమృతా అరోరా | మలైకా అరోరా గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఈమె తెలుగులో మహేష్ బాబు ‘అతిథి’ సినిమాలో ఐటెం భామగా పలకరించింది. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’ లో ఐటెం సాంగ్‌తో కెవ్వు కేక పెట్టించింది. బాలీవుడ్ టాప్ ఐటెం భామైన ఈమె చెల్లెలు అమృతా అరోరా కూడా ‘గోల్మాల్ రిటర్న్స్’, ‘కంబఖ్త్ ఇష్క్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. (File/Photo)
నీతి మోహన్ - శక్తి మోహన్ - ముక్తి మోహన్ | నీతి మోహన్ ఇండియన్ డాన్సర్ కమ్ ప్లే బ్యాక్ సింగర్. ఈమె ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో పాడిన పాటలు ఈమెకు క్రేజ్ తీసుకొచ్చాయి. నీతి మోహన్ ముగ్గురు చెల్లెల్లు కృతి మోహన్, శక్తి మోహన్, ముక్తి మోహన్ కూడా సినీ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకున్నావారే. శక్తి మోహన్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె జీ టీవీ డాన్స్ రియాలిటీ షో సీజన్ 2 విజేతగా నిలిచారు. అంతేకాదు ఈమె బాలీవుడ్లో పలు చిత్రాల్లో ఐటెం భామగా అలరించింది. ఆమె చెల్లెలు ముక్తి మోహన్ కూడా శక్తి మోహన్ బాటలో పలు చిత్రాల్లో ఐటెం పాటలతో పాటు టీవీ షోస్‌లో మెరిసింది. ఇక కృతి మోహన్ స్వతహాగా డాన్సర్ అయినా.. అంతగా పాపులర్ కాలేదు. (File/Photo)
నేహా శర్మ - అయిషా శర్మ | నేహా శర్మ తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’తో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్లో పరిమితం కావడం.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో సరైన గుర్తింపు తెచ్చుకోలేదు. ఈమె చెల్లెలు అయిషా శర్మ కూడా జాన్ అబ్రహం ‘సత్యమేవ జయతే’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. (File/Photo)
గౌహర్ ఖాన్ - నిగార్ ఖాన్ | గౌహర్ ఖాన్.. రణ్‌బీర్ కపూర్.. ‘రాకెట్ సింగ్’ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత పలు టీవీ షోలతో పాటు హిందీ బిగ్‌బాస్‌లో మెరిసింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించింది. ఆమె చెల్లెలు నిగార్ ఖాన్ కూడా ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’షోలో వివిధ పాత్రల్లో అలరించింది. దాంతో పాటు తారక్ మెహతా కా ఉల్తా చెష్మా’ ప్రోగ్రామ్’ పాపులర్ అయింది. (Twitter/Photo)
పద్మిని కొల్హాపూరి - శివాంగి కొల్హాపూరి - తేజస్విని కొల్హాపూరి | పద్మిని కొల్హాపూరి 80వ దశకంలో హీరోయిన్గా అలరించింది. పద్మినీ అక్క శివాంగి కొల్హాపూరి ప్రముఖ నటుడు శక్తి కపూర్‌ను పెళ్లాడింది. ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్, నటుడు సిద్ధాంత్ కపూర్ ఈమె పిల్లలే. ఇక తేజస్వినీ కపూర్ పలు సినిమాల్స్లో, సీరియల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. (Twitter/Photo)
రైమా సేన్ - రియా సేన్ | బెంగాలీతో పాటు బాలీవుడ్ చిత్ర సీమలో రియా సేన్, రైమా సేన్ ఇద్దరు హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. వీళ్ల అమ్మగారు మూన్‌మూన్ సేన్ కూడా సిరివెన్నెల ఫేమ్ కూడా కథానాయికగా సత్తా చాటారు. వీళ్ల అమ్మమ్మ సుచిత్రా సేన్ కూడా బెంగాలీ తొలి తరం స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది. (Twitter/Photo)
డింపుల్ కపాడియా - సింపుల్ కపాడియా | రిషీ కపూర్ హీరోగా రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న డింపుల్ కపాడియా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇద్దరు బిడ్డలకు తల్లైన తర్వాత కూడా దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయికగా సత్తా చాటింది. ఆమె చెల్లెలు సింపుల్ కపాడియా కూడా అక్క బాటలో హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. (File/Photo)
ట్వింకిల్ ఖన్నా - రింకీ ఖన్నా | డింపుల్ కపాడియా వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా.. బాలీవుడ్ హీరోయిన్గా సత్తా చాటారు. ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా ’శ్రీను’ మూవీలో నటించింది. ఈమె చెల్లెలు రింకీ ఖన్నా కూడా పలు చిత్రాల్లో కథానాయికగా నటించినా.. పెద్దగా సత్తా చాటలేకపోయింది. (File/Photo)
సమీరా రెడ్డి - సుష్మా రెడ్డి | సమీరా రెడ్డి .. హిందీలో ‘ముసాఫిర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగులో ‘అశోక్’, ‘నరసింహుడు’, ‘జై చిరంజీవా’ సినిమాల్లో నటించింది. ఈమె చెల్లెలు సుష్మా రెడ్డి కూడా ‘చుప్కే చుప్కే’ వంటి పలు సినిమాల్లో నటించింది. ఈమె ఇంకో చెల్లెలు మేఘానా రెడ్డి కూడా వీడియో జాకీ, మోడల్‌గా, ప్రొడ్యూసర్‌గా నటించింది. (Twitter/Photo)
సుప్రియా పాఠక్ - రత్నా పాఠక్ | సుప్రియా పాఠక్, రత్నా పాఠక్ ఇద్దరు కూడా ప్రముఖ నటి దినా పాఠక్ కూతుళ్లు. వీళ్లిద్దరు బాలీవుడ్లో పలు చిత్రాల్లో క్యారెక్టర్‌గా రాణిస్తున్నారు. సుప్రియా పాఠక్ ఈమె ప్రముఖ నటుడు పంకజ్ కపూర్ భార్య.. వీళ్ల అబ్బాయి..బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్. ఇక రత్నా పాఠక్. విషయానికొస్తే... బాలీవుడ్ నటుడు నషీరుద్దీన్ షా భార్య. (File/Photo)
తనూశ్రీ దత్తా - ఇషితా దత్తా | తనూశ్రీ దత్తా.. బాలీవుడ్ మూవీ ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈమె .. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు గుప్పించింది. బాలీవుడ్లో మీటూ ఉద్యమానికి తొలి బాటలు వేసింది. ఆమె చెల్లెలు ఇషితా దత్తా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, టబు ముఖ్యపాత్రలో నటించిన ‘దృశ్యం’లో ముఖ్యపాత్రలో నటించింది. (File/Photo)
సాయి పల్లవి - పూజా కన్నన్ | సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా ఏం పరిచయం చేయాలి చెప్పండి..? అమ్మడు స్క్రీన్ పై కనిపిస్తే చాలు అదో రకమైన మాయ ఉంటుంది. ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ముఖ్యంగా చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా అదిరిపోయే ఇమేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. ఆమె చెల్లెలు పూజా కన్నన్ త్వరలో ఓ తమిళ సినిమాతో తెరంగేట్రం చేయనుంది. Sai pallavi sister Pooja Kannan Photo : Instagram
తాప్సీ పన్ను - షగున్ పన్ను | దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్గా ప్రారంభించింది తాప్సీ. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ ఓ వైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా ఈమె చెల్లెలు షగున్ పన్ను కూడా త్వరలో హీరోయిన్గా సత్తా చూపెట్టడానికి రెడీ అవుతోందట. (File/Photo
యామీ గౌతమ్ - సురిలీ గౌతమ్ | యామీ గౌతమ్ .. హిందీలో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘విక్కీ డోనర్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో కూడా ‘గౌరవం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాల్లో నటించింది. యామీ గౌతమ్ చెల్లెలు సురిలీ గౌతమ్.. పంజాబీ సినిమా ‘పవర్ కట్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈమె అంతకు ముందు పలు టీవీ షోల్లో ‘మీట్ మిలా దే రబ్బా’లో యాక్ట్ చేసింది. వీళ్లిద్దరి తండ్రి ముఖేష్ గౌతమ్.. పంజాబీలో ఫేమస్ డైరెక్టర్. (Twitter/Photo)
లతా మంగేష్కర్ - ఆశా భోంస్లే - ఉషా మంగేష్కర్ | భారతరత్న లతా మంగేష్కర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. భారత కోకిలగా పేరు గాంచిన ఈమె చెల్లెలు ఆషా భోంస్లే కూడా అక్కకు తగ్గ చెల్లెలుగా నేపథ్య గాయనిగా రాణించారు. వీళ్లిద్దరు భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం. వీళ్ల ఇంకో సోదరి ఉషా మంగేష్కర్ కూడా నేపథ్య గాయనిగా కొన్ని సినిమాల్లో అలరించారు. మొత్తంగా హీరోయిన్స్ కాకుండా గాయనిమణుల జాబితాలో వీళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. (Twitter/Photo)