సీనియర్ హీరో అర్జున్, తెలుగులో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ఆయనకు వివాదం ఏర్పడింది. ఇటీవలే ఓ ప్రెస్ మీట్ పట్టి మరీ విశ్వక్ సేన్ ఆగడాలను బయటపెట్టారు అర్జున్. ఈ ప్రెస్ మీట్లో విశ్వక్ సేన్‌పై అర్జున్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
సీనియర్ హీరో అర్జున్ సర్జా (Arjun Sarja) స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అతని కూతురు ఐశ్వర్య సర్జా హీరోయిన్ గా చేస్తుండగా.. విశ్వక్ సేన్ (Vishwak Sen)ని హీరోగా తీసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ కాంట్రవర్సీ నెలకొంది. సినిమా షూటింగ్ సందర్భంగా కొన్ని విషయాల్లో అర్జున్ కి, విశ్వక్ సేన్ కి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు.
ఓ మంచి కథతో మా అమ్మాయిని తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్నా. ఓ కథ తీసుకొని విశ్వక్ సేన్ కి వినిపించగా ఆయనకు బాగా నచ్చింది. ఆ తరువాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ జరిగింది అని అర్జున్ చెప్పారు. అడ్వాన్స్ కూడా ఇచ్చా. ఇక అప్పటి నుంచి ఎన్నిసార్లు కథా చర్చలని పిలిచినా విశ్వక్ సేన్ నా కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. అలా నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ ఎవ్వరికీ చెయ్యలేదు అంటూ అసలు విషయం చెప్పారు అర్జున్.
అయితే ఈ వివాదంపై విశ్వక్ సేన్ కూడా స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ... విశ్వక్సేన్ ఓ ప్రకటన విడుదల చేశాడు. సినిమాలో పాటలు, సంభాషణలు, మ్యూజిక్ గురించి తాను కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవమనని అన్నాడు. ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ అస్సలు అంగీకరించడం లేదని అతడు వాపోయాడు.
అయితే విశ్వక్ సేన్ వెళ్లిపోయినా కూడా సినిమానే ఆపే పరిస్థితిలో అయితే అర్జున్ లేరు. ఎదుకంటే తన కూతురు సినిమా కాబట్టి ఈ మూవీ ఆయనకు ఎంతో సెంటిమెంట్. అందుకే మరో హీరోను పెట్టి అయినా కూడా ఈ సినిమా తీయాలని అర్జున్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఈ మేరకు ఆయన మరో హీరోతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.