Oke Oka Jeevitham OTT | యువ నటుడు శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అక్కినేని అమల ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. Photo : Twitter
‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో అక్కినేని అమల మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇది శర్వాకు 30వ సినిమా కావడం గమనార్హం. నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా కణం పేరుతో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Twitter
ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఒకే ఒక జీవితం నిర్మించారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్లర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీతూ వర్మ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో రీతూ వర్మకు కూడా మంచి హిట్ పడింది. Photo : Twitter
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఒకే ఒక జీవితం మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. ఇటు ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 11.03 కోట్లు వసూలు చేసింది.. Photo : Twitter
'ఓకే ఒక జీవితం' AP/TS కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాం ..3.20 కోట్లు, సీడెడ్ 60 లక్షలు, యూఏలో 84 లక్షలు కలెక్షన్లు సాధించింది. ఈస్ట్‌లో 51 లక్షలు, వెస్ట్‌లో 36 లక్షలు, గుంటూరులో 52 లక్షలు, కృష్ణ .. 50 లక్షలు వసూలు చేసింది. నెల్లూరులో 28 లక్షలు. 28 L టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ చూస్తే ఓవరాల్‌గా 6.81 కోట్లు వసూళ్లను ఈ సినిమా రాబట్టింది.