Unstoppable 2: థర్డ్ ఎపిసోడ్ గెస్టులు వీరే.. బాలయ్య బాబు మరో ప్లాన్
Unstoppable 2: థర్డ్ ఎపిసోడ్ గెస్టులు వీరే.. బాలయ్య బాబు మరో ప్లాన్
Unstoppable 2 Third episode Guests: అన్‌స్టాపబుల్ అంటూ రంగంలోకి దిగి ఆడియన్స్ చేత గోల పెట్టిస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఈ సారి షోని మరింత రసవత్తరంగా సాగిస్తున్నారు. ఫస్ట్ సీజన్ లో బాలయ్య చేసిన హోస్టింగ్ జనానికి పిచ్చెక్కించగా ఈ సారి అంతకుమించి అనేలా రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ఈ సీజన్ థర్డ్ ఎపిసోడ్ గెస్టులు వీరే అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.
ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ 2 షో విజయవంతంగా రన్ అవుతోంది. గతంలో వచ్చిన అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అదే ఊపులో ఈ ప్రోగ్రాం రెండో సీజన్ షురూ చేశారు. తొలి సీజన్‌ని మించిన రెస్పాన్స్ రెండో సీజన్‌కి కనిపిస్తోంది.
2/ 8
అన్‌స్టాపబుల్ అంటూ రంగంలోకి దిగి ఆడియన్స్ చేత గోల పెట్టిస్తున్న నందమూరి బాలకృష్ణ.. ఈ సారి షోని మరింత రసవత్తరంగా సాగిస్తున్నారు. ఫస్ట్ సీజన్ లో బాలయ్య చేసిన హోస్టింగ్ జనానికి పిచ్చెక్కించగా ఈ సారి అంతకుమించి అనేలా రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
3/ 8
ఇటీవలే అన్‌స్టాపబుల్ 2 స్ట్రీమింగ్ షురూ అయింది. అయితే తొలి ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు, లోకేష్ లను తీసుకొచ్చి ఈ సీజన్‌కి పర్ఫెక్ట్ ఓపెనింగ్ ఇచ్చిన బాలకృష్ణ రెండో ఎపిసోడ్ కోసం యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లను తీసుకొచ్చారు.
4/ 8
ఇప్పటివరకు ప్రసారమైన ఈ రెండు ఎపిసోడ్స్ భారీ స్పందన తెచ్చుకోవడంతో పాటు జనానికి తెలియని ఎన్నో విషయాలను బయటపెట్టాయి. దీంతో థర్డ్ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉండేలా ప్లాన్ చేసిన ఆహా టీమ్.. మరో ఇద్దరు యంగ్ హీరోలను రంగంలోకి దించుతోంది.
5/ 8
అన్‌స్టాపబుల్ 2 థర్డ్ ఎపిసోడ్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు శర్వానంద్, అడవిశేష్ లను ఇంటర్వ్యూ చేయబోతున్నారు బాలకృష్ణ. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చింది ఆహా టీమ్. ఈ ఎపిసోడ్ నవంబర్ లో స్ట్రీమ్ కానుందని చెప్పారు.
6/ 8
ఇప్పటివరకు ప్రసారమైన రెండు ఎపిసోడ్స్ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావంతో, ఇప్పుడు మరోసారి ఇదే స్ట్రాటెజీని ఫాలో కాబోతున్నారట బాలకృష్ణ. శర్వానంద్, అడవిశేష్ ల సీక్రెట్స్ బయటపెట్టించి ఆడియన్స్‌కి సరికొత్త ట్రీట్ ఇవ్వబోతున్నారట.
7/ 8
అన్‌స్టాపబుల్ 2 మూడో ఎపిసోడ్లో రమ్యకృష్ణ, రాశీ ఖన్నాల సందడి చూడబోతున్నామనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో తాజాగా శర్వానంద్, అడవిశేష్ లు వస్తున్నారని చెప్పి సర్ప్రైజ్ చేశారు. చూడాలి మరి బాలకృష్ణతో రమ్యకృష్ణ, రాశీ ఖన్నాల సందడి ఎప్పుడు ఉండనుందనేది.
8/ 8
ఇకపోతే ఈ రెండో సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా సందడి చేస్తారని అంతా భావిస్తున్నారు. అలాగే బాలయ్య బాబు ముందుకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వస్తారని తెలుస్తోంది. అతిత్వరలో ఏదో ఒక ఎపిసోడ్ లో చిరుతో బాలయ్య సందడి చూడటం పక్కా అని చెప్పుకుంటున్నారు.