షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ స్టార్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. "వైవా" అనే షార్ట్ కామెడీ వీడియోతో 2013లో యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఇతను గత ఏడేళ్ళుగా వరుస షార్ట్ ఫిలిమ్స్ తో నటనలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విడుదలైన "ది సాఫ్ట్ వేర్ డెవలపర్", "సూర్య" వంటి వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ లో మంచి క్రేజ్ సంపాదించి మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయాడు.
శ్రీరామ చంద్ర మొదటి స్థానంలో ఉండగా.. షణ్ముఖ్ రెండు, మానస్ మూడో స్థానంలో ఉన్నట్లు కొన్ని వెబ్ సైట్లు నిర్వహించిన ఓటింగ్ సర్వేలో తేలింది. అయితే దీనిలో ఈ వారం డేంజర్ జోన్ లో మాత్రం సిరి, లోబో ఉన్నారు. ఈ ఇద్దిరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనే ప్రచారం సాగుతోంది. అందులో ఎక్కువగా లోబోనే ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.