Poorna : ఘనంగా పూర్ణ సీమంతం.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..!
Poorna : ఘనంగా పూర్ణ సీమంతం.. ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్..!
టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ఇటీవలే పెళ్లి చేసుకుంది. దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్తను పూర్ణ ప్రేమించి పెళ్లాడింది. అయితే ఇటీవలే ఆమె గర్భవతి కూడా అయ్యింది. దీంతో పూర్ణకు ఏడో నెల రాగానే ఘనంగా సీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు.
టాలీవుడ్ నటి పూర్ణ త్వరలో తల్లి కాబోతున్నా సంగతి తెలిసిందే. పూర్ణకు గతేడాది జూన్‌లో దుబాయ్ బేస్డ్ బిజినెస్మెన్ షానిద్ ఆసిఫ్ అలీతో జరిగింది. తాజాగా పూర్ణ బేబి షవర్ ఫంక్షన్స్ జరుపుకుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ఆమె అభిమానులతో పంచుకుంది.
2/ 9
మలయాళ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫోటోలు , వీడియోలను తన అభిమానులతో పంచుకుంది. ఇందులో రెడ్ కలర్ శారీలో స్వీట్లు, గాజులు చూపిస్తూ.. నటి క్యూట్‌గా కనిపిస్తోంది.
3/ 9
ప్రస్తుతం ఆమె 7వ నెల గర్భవతి. ఈ క్రమంలో కేరళ సంప్రదాయం ప్రకారం 7వ నెలలో గర్భవతికి సీమంతం లాంటీ ఓ వేడుక చేస్తారు. దీంతో తాజాగా జరిగిన ఫంక్షన్ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.
4/ 9
పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తూనే ఉన్నారు. మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు.
5/ 9
ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. ఆ తర్వాత పలు సినిమాల్లా నటించినా.. పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా ’సిల్లీ ఫెలోస్’ ‘అఖండ’ ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.
6/ 9
ఈ భామ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్ణ యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. వెంటనే అతడ్ని పెళ్లి కూడా చేసుకున్నారు.
7/ 9
పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నటి పూర్ణకు ఆమె భర్త షానిద్ వివాహం సమయంలో కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు కూడా ఇచ్చారని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
8/ 9
పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడట. దీని విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ నడుస్తోంది.
9/ 9
ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది పూర్ణ.. పలు టీవీ షోలకు జడ్జీగా కూడా ఆమె హోస్ట్ చేశారు. Photo : Instagram