Home » photogallery » movies »

SHAMNA KASIM LOOKS HOT IN HER LATEST PHOTO SHOOT SR

అదరగొడుతోన్న పూర్ణ (షమ్నా ఖాసీం) హాట్ లుక్స్..

పూర్ణ.. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకశాలు రాలేదు ఈ భామకు. దీంతో మలయాళ సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 సినిమాల్లో నటించింది పూర్ణ. కేరళకు చెందిన పూర్ణ (షమ్నా ఖాసీం) ముస్లిం కుటుంబంలో జన్మించింది. సినిమాల్లోకి వచ్చాక తన అసలు పేరు షమ్నా ఖాసీంతో కాకుండా పూర్ణ పేరుతో రాణిస్తోంది.