Shah Rukh Khan - Yash : షారుఖ్ ఖాన్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. బాలీవుడ్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సూపర్ స్టార్‌గా సత్తా చాటారు. అటు కేజీఎఫ్‌తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చూపెట్టాడు. ఇక వీళ్లిద్దరి మధ్య విచిత్రమైన పోలిక ఉంది. ఈ ఇద్దరు కూడా టీవీ స్టార్స్ నుంచి ఫిల్మ్ సూపర్ స్టార్స్‌గా ఎదిగారు. (File/Photo)
ప్రస్తుతం సినీ రంగంలో సత్తా చాటుతున్న చాలా మంది ముందుగా స్మాల్ స్క్రీన్ పై సందడి చేసి ఆ తర్వాత బిగ్ స్క్రీన్ పై సత్తా చుపెట్టారు. మాధవన్, విద్యా బాలన్ .. మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంటగా ‘గురు’ సినిమాలో వీరు ఓ జంటగా నటించారు. ఇక యశ్ కేజీఎఫ్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే కదా. (File/Photo)
షారూఖ్ ఖాన్ : షారూఖ్ ఖాన్ తన నటజీవితాన్ని ‘ఫౌజీ’ అనే TV సీరియల్‌తో ప్రారంభించారు. ఆ సీరియల్ అద్బుత ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత సర్కస్, వాగ్లె కీ దునియా వంటి ఇతర టెలివిజన్ షోలను కూడా చేశారు. SRK మొదటి సినిమా దీవానా, దీనిలో రిషి కపూర్ తో ఆయన నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ దివ్య భారతి. ఆ తర్వాత బాలీవుడ్ కింగ్ గా SRK ఎదిగింది తెలిసిందే. (File/Photo)
యశ్ | కన్నడ హీరో యశ్ ..కేజీఎఫ్ మూవీ వచ్చే వరకు మాముల హీరోనే. అప్పటి వరకు ఈయన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 1తో ఒక్కసారి టాక్ ఆఫ్ ది భారతీయ ఇండస్ట్రీ అయ్యారు. ఇక కేజీఎఫ్ 2తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపాడు. ఏకంగా రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో దక్షిణాది నుంచి ఈ ఫీట్ అందుకున్న మూడో సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈయన హీరో కాకముందు.. పలు సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తన సత్తా చాటారు. (Twitter/Photo)
మాధవన్ | తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘సఖి’ మూవీతో హీరోగా పరిచయమైన మాధవన్.. హిందీలో ‘రెహ్నా మై తేరే దిల్ మే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. హీరోగా కెరీర్ ప్రారంభించక ముందు.. జీ టీవీలో ‘బనేగి అప్నీ బాత్’, ఘర్ జమాయి’, సాయా వంటి సీరియల్స్‌లో మెరిసారు. అంతేకాదు టీవీల్లో ఆరోహణ్, సీ హాక్స్ వంటి పలు రియాలిటీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు. (Twitter/Photo)
విద్యా బాలన్ (Vidya balan) | విద్యా బాలన్ కథానాయికగా పరిచయం కాక ముందు ఏక్తా కపూర్.. ‘హమ్ పాంచ్’ సీజన్లో రాధిక పాత్రలో అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్లో పరిణిత మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘డర్టీ పిక్చర్’ మూవీతో ఏకంగా నేపనల్ అవార్డు అందుకుంది. ఇక ఈమె తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బసవ తారకం పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్లో సత్తా చాటుతున్న చాలా మంది హీరోలు ఒకపుడు సీరియల్స్‌లో సత్తా చాటి .. బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు. ఈ సందర్బంగా టీవీలో మొదట నటించి అక్కడ ఓ వెలుగు వెలిగి తర్వాత వెండితెరకు పరిచయమైన నటులు, వారీ విశేషాలు. (Twitter/Photo)
ఆయుష్మాన్ ఖురానా | MTV రోడీస్‌లో విజేతగా నిలిచిన ఆయుష్మాన్ ఖురానా, తన ప్రస్థానాన్ని రియాలిటీ షోల ద్వారా ప్రారంభించాడు. అంతేకాకుండా పలు చానల్స్‌లో RJ గా, VJ గాను చేశాడు. ఆయుష్మాన్ మొదటి చిత్రం వికీ డోనార్, దీన్ని సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఆయుష్మాన్ పాపులారిటీ సంగతి తెలిసిందే. (File/Photo)
ఇర్ఫాన్ ఖాన్ | ఇర్ఫాన్ ఖాన్ నట జీవితం 1988లో ప్రారంభం అయ్యింది. మొదట ఆయన టెలివిజన్‌లో నటించాడు. భారత్ ఏక్ ఖోజ్, సారా జహాన్ హమరా, బనేగీ అప్నీ బాత్, చంద్రకాంతా వంటి అనేక టీవీ సీరియల్స్‌లో ఇర్ఫాన్ నటించాడు. అతని మొదటి చిత్రం ‘సలాం బొంబే’, తర్వాత ఎక్ డాక్టర్ కీ మౌత్, ది వారియర్ సినిమాలు చేశాడు. ఈ సినిమాల తర్వాత ఆయన బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లో కూడా నటించి ప్రపంచ వ్యాప్తంగా తనకు మార్కెట్ వుందని నిరుపించుకున్నాడు.(File/Photo)
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2009 లో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. పవిత్ర రిస్థా అనే హింది సీరియల్ లో నటించి, దేశ వ్యాప్తంగా తనకు అభిమానులను ఎర్పరచుకున్నాడు. ఆ సీరియల్ తనకు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. సుశాంత్ తన బాలీవుడ్ ఎంట్రీని "కై పో చే" అనే సినిమా ద్వారా ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తీసిన యం యస్ దోని- ది అన్టోల్ఢ్ స్టోరీ సినిమాలో సుశాంత్ తన నటనతో మనల్నీ అలరించింది తెలిసిందే. (File/Photo)
శరత్ కేల్కర్ | శరత్ కేల్కర్ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాతో పలకరించారు. ముఖ్యంగా హిందీలో డబ్ అయ్యే సౌత్ సినిమాల్లో హీరోలకు డబ్బింగ్ చెప్పడంతో ఈయన ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇక ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాలో రెబల్ స్టార్‌కు డబ్బింగ్ చెప్పింది ఈయనే. ఇక ఈయన కెరీర్ మొదలైంది దూరదర్శన్‌లో ప్రసారమయిన ‘ఆక్రోష్’తో కావడం విశేషం. ఆ తర్వాత పలు సీరియల్స్, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లతో ఈయన పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ‘తానాజీ’, అక్షయ్ కుమార్ ‘లక్ష్మి’ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. (Twitter/Photo)
మోహిత్ రైనా | మోహిత్ రైనా.. బాలీవుడ్లో ప్రసారమైన ‘దేవో కా దేవ్.. మహాదేవ్’ సీరియల్లో పరమశివుడి వేషంతో పాపులర్ అయ్యారు. అంతకు ముందు ఈయన ‘అంతరిక్ష్’, మరియు చెహ్రా’, గంగా కీ ధీజ్’ వంటి టీవీ సీరియల్స్ షోతో పాపులర్ అయ్యారు. ఇక ఈయన ‘యూరీ’ సినిమాలో ఓ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. (Twitter/Photo)
యామి గౌతమ్ | యామి గౌతమ్ తన నట జీవితాన్ని ‘చాంద్ కే పర్ చలో ’అనే TV సీరియల్ ద్వారా ప్రారంభించింది. తన మొదటి సినిమా విక్కీ డోనార్. దీనిలో ఆయుష్మాన్ కూడా నటించాడు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా..బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. తర్వాత యామి గౌతమ్ సినిమాలు, తన విజయాలు తెలిసినవే. (File/Photo)
స్వాతీ రెడ్డి | స్వాతీ రెడ్డి లేదా కలర్స్ స్వాతి. ప్రేక్షకులకు మొదట తెలిసింది ఆ పేరుతోనే. స్వాతీ రెడ్డి మొదట ఓ TVలో కలర్స్ అనే ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత తన సినీ ప్రస్థానాన్ని డేంజర్ అనే థ్రిల్లర్‌తో స్టార్ట్ చేసింది. ఆ సినిమా తర్వాత అడవారీ మాటలకు అర్థాలు వేరులే, అష్టా చమ్మా, కలవరమాయే మదిలో లాంటీ సినిమాలు చేసింది. ఈ మద్యే పెళ్లి కూడా చేసుకుంది. (File/Photo)