ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేసిన కింగ్ ఖాన్, సుహానా.. నువ్వు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదు అన్నవిషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. నువ్వు నువ్వుగా మారే క్రమంలోనే.. పరిపూర్ణులుగా మారే దిశగా అడుగులు వేయవచ్చు. నటిగా మీ పట్ల దయ చూపండి. ఈల చప్పట్లు మీకు చెందవు. తెరపై మీ పాత్రలో కొంత భాగం మాత్రమే మీతో చేరుతుందని మర్చిపోవద్దు. నటుడిగా దయగా ఉండాలి.. అందర్నీ మెప్పించాలి.