Pathaan Collections : షారుఖ్ ఖాన్ అంటే కేవలం హిందీ సినిమాలు చూసే వారికి మాత్రమే కాదు, ఇటు సౌత్ లోను ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, పరిచయం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన షారుఖ్‌కు వరుసగా పరాజయాలు వచ్చాయి. Photo : Twitter
ఈ క్రమంలో లేటెస్ట్గా షారుఖ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ (Pathaan Movie ). భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా 7700 స్రీన్స్లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక ఈ సినిమా ఇటు హిందీతో పాటు తెలుగు, తమిళ భాషాల్లో ఒకేసారి విడుదలైంది. ‘పఠాన్’ సినిమా మొదటి రోజు ఏకంగా రూ. 55 కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్స్‌ను కలెక్ట్ చేసి వావ్ అనిపించింది.. Photo : Twitter
ఈసినిమాకు కూడా ఓ రేంజ్లో బుకింగ్స్ జరిగాయి. బాహుబలి 2(హిందీ), తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఈసినిమా బుకింగ్స్ పరంగా తన సత్తాను చాటింది. బాహుబలి 2(హిందీ)కి 6.50 లక్షల టిక్కెట్స్ బుక్ అవ్వగా.. పఠాన్‌కు 5.56 లక్షల టిక్కెట్స్ బుక్ అయ్యాయి. ఇక పఠాన్ తర్వాత కేజీయఫ్ 2, వార్ సినిమాలున్నాయి. Photo : Twitter
మన దేశంలోనే రూ. 1000కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన తొలి హిందీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. మన దేశంలో రూ. 623 కోట్ల గ్రాస్.. ఓవ్సీస్లో రూ. 377 కోట్ల గ్రాస్ రాబట్టాయి. కరోనా తర్వాత హిందీ చిత్ర సీమలో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన డైరెక్ట్ హిందీ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. Photo : Twitter
అంతేకాదు పఠాన్ అమెరికాలో "బాహుబలి 2" కలెక్షన్స్‌ను బద్దలుకొట్టింది. అంతేకాదు ఈ సినిమా బాహుబలి2 (511 కోట్ల నెట్) రికార్డ్‌ను బద్దలు కొట్టింది. హిందీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 514 కోట్ల (620 కోట్ల గ్రాస్) రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసింది. అయితే గ్రాస్ పరంగా మాత్రం బాహుబలి2 (720 కోట్ల) నే మొదటి స్థానంలో ఉంది. . Photo : Twitter
ఇక తాజాగా పఠాన్ ఓటీటీ విడుదల విషయంలో క్లారిటీ వచ్చింది.. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.. పఠాన్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషలకు కలిపి దాదాపుగా 100 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసినట్లు టాక్. ఇక లేటెస్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. పఠాన్ సినిమాను మార్చి 22 నుంచి స్ట్రీమింగ్కు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోరేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమాను మరోసారి తమ ఫోన్స్‌లో చూడోచ్చిన సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. Photo : Twitter
మార్చి 22న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ అది అలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త చరిత్రను క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ పఠాన్ ఓ సంచలనం సృష్టించింది. దాదాపుగా ఓ 4 ఏళ్ల తర్వాత వెండితెరపై కంబ్యాక్ ఇచ్చిన హిందీ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ హిందీలో ఆల్ టైం కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమా హిందీలోనే కాదు తెలుగులోను పఠాన్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. Photo : Twitter
తెలుగులో ఇప్పటి వరకు ఏ హిందీ మూవీ కూడా 31 కోట్ల గ్రాస్ మార్క్‌ను మించి వసూలు చేయలేదు. అయితే ఆ మధ్య వచ్చిన రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర తెలుగులో 30.60 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. అయితే ఇది అన్ని వర్షన్స్ కలిపి అంత మొత్తం రాబట్టంది. ఇక పఠాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 55 కోట్ల రేంజ్లో గ్రాస్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. ఈ కలెక్షన్స్‌లో సగం ఒక్క నైజాం ఏరియా నుండే రావడం విశేషం. Photo : Twitter
అంతేకాదు ఈ సినిమా బాహుబలి2 (511 కోట్ల నెట్) రికార్డ్‌ను బద్దలు కొట్టింది. హిందీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 514 కోట్ల (620 కోట్ల గ్రాస్) రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని బాహుబలి2 రికార్డ్ ను బ్రేక్ చేసింది. అయితే గ్రాస్ పరంగా మాత్రం బాహుబలి2 (720 కోట్ల) నే మొదటి స్థానంలో ఉంది. . Photo : Twitter
ఇక పఠాన్ ఓటీటీ విడుదల విషయానికి వస్తే.. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అంతేకాదు భారీ ధర పెట్టి ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆ సంస్థ సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. పఠాన్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపుగా 100 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసినట్లు టాక్. అంతేకాదు ఏప్రిల్ 29న ఈ సినిమాని ప్రసారం చేయాలని అమెజాన్ ప్రైమ్ భావిస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంటుంది. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా రన్ టైమ్ 146.16 నిమిషాలు ( 2 గంటల 26 నిమిషాల 16 సెకన్లు) ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్’ సాంగ్ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీపిక పదుకొణె (Deepika Padukone) అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి. Photo : Twitter
ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్.. దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు దీపికాకు రూ. 15 కోట్లు.. జాన్ అబ్రహంకు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. మాస్ ‘రా’ ఏజెంట్ కథతో వస్తోన్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జనవరి 25న భారత గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదలైంది. Photo : Twitter
పఠాన్ సినిమా కథ విషయానికొస్తే.. 2019లో భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలిగిస్తోంది. దీంతో పాకిస్థాన్ దేశానికి చెందిన ఐఎస్ఐ కసితో రగిలిపోతూ ఉంటుంది. దీంతో ‘ఔట్ ఫిట్ X ’ అనే కాంట్రాక్ట్ పై పనిచేసే ప్రైవేట్ టెర్రరిస్ట్ గ్రూపును ఆశ్రయిస్తోంది పాకిస్థాన్. దీనిని జిమ్ (జాన్ అబ్రహం) నాయకుడు. ఇతనో మాజీ ‘రా’ ఏజెంట్. క్లిష్ట సమయంలో తనను దేశం పట్టించుకోకపోవడంతో అతను భారత్ పై పగ పెంచుకుంటాడు. ఈ నేపథ్యంలో అతను రష్యాలోని ‘రక్తబీజ్’ అనే బయోవెపన్‌ను మన దేశంలోని ప్రధాన నగరాలపై ప్రయోగించాలనుకుంటాడు. Photo : Twitter
ఈ రక్తబీజ్ అనేది స్మాల్ఫాక్స్కు చెందినది. కరోనా కన్నా డేంజరస్. ఇది ఒకవేళ ఈ బయోవెపన్ ప్రయోగిస్తే దేశంలోని ప్రజలు కొన్ని రోజుల్లో చనిపోతారు. దేశం మొత్తం నాశనం అవుతోంది. ఈ బయోవెపన్ ప్రయోగించకుండా ఉండాలంటే పాకిస్థాన్‌కు కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేయాలని షరతు పెడతాడు. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన అజ్ఞాత ‘రా‘ ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్).. జిమ్‌కు చెందిన ‘ఔట్ఫిక్స్’ను దాని అధినేతను అంతం చేసి దేశాన్ని కాపాడాడా లేదా అనేదే పఠాన్ మూవీ స్టోరీ. Photo : Twitter