Pathaan Collections : షారుఖ్ ఖాన్ అంటే కేవలం హిందీ సినిమాలు చూసే వారికి మాత్రమే కాదు, ఇటు సౌత్ లోను ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, పరిచయం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన షారుఖ్‌కు వరుసగా పరాజయాలు వస్తున్నాయి. Photo : Twitter
ఈ క్రమంలో లేటెస్ట్గా షారుఖ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ (Pathaan Movie ). భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా 7700 స్రీన్స్లో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అందులో ఇండియాలో 5200 ఉండగా.. ఓవర్సీస్ 2500. ఇక ఈ సినిమా ఇటు హిందీతో పాటు తెలుగు, తమిళ భాషాల్లో ఒకేసారి విడుదలైంది. Photo : Twitter
ఇప్పటికే పాటలతో పాటు ట్రైలర్‌తో కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది సినిమా. ఇక ఈసినిమాకు కూడా ఓ రేంజ్లో బుకింగ్స్ జరిగాయి. బాహుబలి 2(హిందీ), తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఈసినిమా బుకింగ్స్ పరంగా తన సత్తాను చాటింది. బాహుబలి 2(హిందీ)కి 6.50 లక్షల టిక్కెట్స్ బుక్ అవ్వగా.. పఠాన్‌కు 5.56 లక్షల టిక్కెట్స్ బుక్ అయ్యాయి. ఇక పఠాన్ తర్వాత కేజీయఫ్ 2, వార్ సినిమాలున్నాయి. Photo : Twitter
ఊహించని రేంజ్లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌తో ఊచకోత కోస్తున్న పఠాన్.. స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తోంది. అంతేకాదు భారీ ధర పెట్టి ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆ సంస్థ సొంతం చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది. పఠాన్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపుగా 100 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. అంతేకాదు ఏప్రిల్ 25న ఈ సినిమాని ప్రసారం చేయాలని అమెజాన్ ప్రైమ్ భావిస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంటుంది. Photo : Twitter
ఇక ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా రన్ టైమ్ 146.16 నిమిషాలు ( 2 గంటల 26 నిమిషాల 16 సెకన్లు) ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్’ సాంగ్ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీపిక పదుకొణె (Deepika Padukone) అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి. Photo : Twitter
పఠాన్ మూవీ విడుదలకు ముందే డిజిటిల్ రైట్స్ కు భారీ డీల్ కుదిరింది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని కోట్ల రూపాయలకు రిజర్వ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ "ఓ టి టి" హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్ల ఆఫర్ చేసినట్లు , దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. Photo : Twitter
ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్.. దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు దీపికాకు రూ. 15 కోట్లు.. జాన్ అబ్రహంకు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. మాస్ ‘రా’ ఏజెంట్ కథతో వస్తోన్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జనవరి 25న భారత గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదలైంది. Photo : Twitter
పఠాన్ సినిమా కథ విషయానికొస్తే.. 2019లో భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలిగిస్తోంది. దీంతో పాకిస్థాన్ దేశానికి చెందిన ఐఎస్ఐ కసితో రగిలిపోతూ ఉంటుంది. దీంతో ‘ఔట్ ఫిట్ X ’ అనే కాంట్రాక్ట్ పై పనిచేసే ప్రైవేట్ టెర్రరిస్ట్ గ్రూపును ఆశ్రయిస్తోంది పాకిస్థాన్. దీనిని జిమ్ (జాన్ అబ్రహం) నాయకుడు. ఇతనో మాజీ ‘రా’ ఏజెంట్. క్లిష్ట సమయంలో తనను దేశం పట్టించుకోకపోవడంతో అతను భారత్ పై పగ పెంచుకుంటాడు. ఈ నేపథ్యంలో అతను రష్యాలోని ‘రక్తబీజ్’ అనే బయోవెపన్‌ను మన దేశంలోని ప్రధాన నగరాలపై ప్రయోగించాలనుకుంటాడు. Photo : Twitter
ఈ రక్తబీజ్ అనేది స్మాల్ఫాక్స్కు చెందినది. కరోనా కన్నా డేంజరస్. ఇది ఒకవేళ ఈ బయోవెపన్ ప్రయోగిస్తే దేశంలోని ప్రజలు కొన్ని రోజుల్లో చనిపోతారు. దేశం మొత్తం నాశనం అవుతోంది. ఈ బయోవెపన్ ప్రయోగించకుండా ఉండాలంటే పాకిస్థాన్‌కు కశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చేయాలని షరతు పెడతాడు. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన అజ్ఞాత ‘రా‘ ఏజెంట్ పఠాన్ (షారుఖ్ ఖాన్).. జిమ్‌కు చెందిన ‘ఔట్ఫిక్స్’ను దాని అధినేతను అంతం చేసి దేశాన్ని కాపాడాడా లేదా అనేదే పఠాన్ మూవీ స్టోరీ. Photo : Twitter