సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఈ రోజుకు కూడా శృంగారం గురించి మాట్లాడటానికి చాలా మంది మొహమాటపడుతుంటారు.. సిగ్గు పడుతుంటారు. అలాంటిది కొందరు హీరోయిన్లు మాత్రం ఓపెన్‌గానే సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో రాధిక ఆప్టే లాంటి ముద్దుగుమ్మలు శృంగారం గురించి ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నదున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక సమంత అయితే తాను సెక్స్ లేకుండా ఉండలేనని బాహాటంగానే ఒప్పుకుంది.
తాజాగా ఈమె సెక్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అందులోనూ గర్భంతో ఉన్నపుడు సెక్స్ చేయొచ్చా అనే విషయం గురించి కూడా చెప్పుకొచ్చింది కరీనా. ఈమె ఇద్దరు పిల్లలకు తల్లైంది. తైమూర్ అలీ ఖాన్ ఇప్పటికే పెద్దోడైపోయాడు.. ఈ మధ్యే మరో అబ్బాయికి జన్మనిచ్చింది కరీనా కపూర్. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నపుడు ఖాన్స్ పెగ్రెన్సీ బైబిల్ అనే పేరుతో పుస్తకం రాసింది కరీనా.
ఆడవాళ్ల నిర్ణయాలకు.. ఇష్టాలకు గౌరవం ఇవ్వాలని చెప్పింది కరీనా. ప్రెగ్నెన్సీ సమయంలోనూ సెక్స్ చేసుకోవచ్చని సెక్సాలజిస్టులు చెప్పేది కేవలం శాస్త్రీయ అంచనా మాత్రమే అని.. అసలైన ఇబ్బందులు ఆడవాళ్లకు మాత్రమే తెలుస్తాయంటుంది కరీనా. స్త్రీల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, శారీరక సహకారం కీలకంగా ఉండాలని చెప్పింది.