Aishwarya pisse: బుల్లితెర నటి, కన్నడ కుట్టి ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు అందుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించింది. కన్నడలో పలు సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం కస్తూరి సీరియల్ లో బిజీగా ఉంది. ఇక ఈ సీరియల్ కంటే ముందు అగ్ని సాక్షి సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ఈ సీరియల్ అత్యధిక రేటింగ్ తో దూసుకుపోగా.. ఈ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఐశ్వర్య. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో బాగా ఆకట్టుకుంటుంది.