అందులో భాగంగానే హాస్పిటల్లో ఆయన గడ్డం గీయడం, దుస్తులు మార్చడంతో పాటు టాయిలెట్ బ్యాగ్ కూడా తీస్తాడు. నిజానికి ఈ సన్నివేశం చెప్పడానికి చాలా ఇబ్బందిపడ్డానని చెప్పాడు సుకుమార్. ఎంతైనా స్టార్ హీరో కదా అలాంటి సీన్ చెబితే ఏమంటాడో అని భయమేసిందని.. కానీ భయపడుతూ ఆ సన్నివేశం చెప్పిన తర్వాత ఓకే చేసేద్దామని వెంటనే రామ్ చరణ్ చెప్పారని తెలిపాడు సుకుమార్.