దర్శకుడు శంకర్‌కు కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈయన సినిమాలు ఒకప్పుడు తెలుగులోనూ అద్భుతమైన విజయం సాధించాయి. ఇంకా చెప్పాలంటే బాయ్స్, అపరిచితుడు లాంటి సినిమాలు తమిళం కంటే తెలుగులోనే పెద్ద విజయం అందుకున్నాయి. దానికి ముందు ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, జెంటిల్మెన్ లాంటి సినిమాలు కూడా సంచలన విజయం సాధించాయి.
ఇక రోబో చేసిన అద్భుతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 12 ఏళ్ల కింద ఈ సినిమా తెలుగులో 40 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు శంకర్. ప్రస్తుతం తనేంటో నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఒకవైపు కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమా చేస్తున్న శంకర్.. మరోవైపు రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు.
MBBS చేసి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న అదితికి సినిమాలపై ఆసక్తి ముందు నుంచి ఉంది. అందుకే కార్తి సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతుంది. శంకర్ కూతురు ఎంట్రీపై అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ ఇండస్ట్రీలో నట వారసురాళ్లు వచ్చారు కానీ దర్శకుల కూతుళ్లు వచ్చింది తక్కువే. అందుకే అదితి కోసం అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
దీన్ని కూడా శంకర్ తన సొంత ప్రొడక్షన్లో నిర్మిస్తుండగా.. ప్రేమిస్తే దర్శకుడు బాలాజీ శక్తివేల్ తెరకెక్కించబోతున్నాడు. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. మొత్తానికి తక్కువ గ్యాప్ లోనే అటు శంకర్ కూతురు.. కొడుకు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. మరి వీళ్ళు ఎంత వరకు రాణిస్తారో చూడాలి.