గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి మధ్య ఆసక్తికరమైన ప్రశ్న సమాధానాల పోరు జరుగుతుంది. వర్మ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని సమాధానం ఇస్తూనే.. కొన్ని ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు వాటికి వర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు ద్వారా నన్ను అడిగిన ప్రశ్నలకి నా సమాధానం అంటూ మొదలుపెట్టారు వర్మ.
1. నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ.. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ.. అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.. మీరు ఎడారిలో నీళ్ళు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు.. కానీ అది పరిస్థితిని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటే మార్కెట్ అనేది ఉన్నదే దానికి.. కావాలనే కోరికని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడానికే రకరకాల లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారు. అది తప్పని గవర్నమెంట్ వాటికి అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం.
2. ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవ్వని ఒక పెయింటింగ్‌ని.. కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు.. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్‌కి, ఐడియాకి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడ్వాన్స్మెంట్ అనేది కంటిన్యువస్‌గా అన్ని వస్తువులు ఇంకా ఇంకా బెటర్‌గా ఉండేలా ప్రయత్నించడం.. అది బెటర్ అవునా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.
3. కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్‌పెరన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం.. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్‌కి తెలియకుండా చేసే క్రైమ్.. ఓపెన్‌గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది..? ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీలలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్‌లు 75 రూపాయల నుంచి 2200 రూపాయల వరకూ వెరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై..
4. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్య, గోధుమ తదితర లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర చాలా పడిపోయినప్పుడు కానీ.. ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ప్రేక్షకులలో కానీ ఎక్కడ వచ్చిందండీ? లూఠీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్‌గా లాక్కున్నప్పుడు.. అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు.. ఆ ట్రాన్సాక్షన్ లీగల్‌గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది..
5. థియేటర్లనేవి ప్రజా కోణంలో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని మీకు ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగంలో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్‌లో కానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు. థియేటర్లనేవి జూన్ 19, 1905న నికెలోడియోన్ అనే ప్రపంచంలోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికాలో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు. అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు. కావాలంటే మీ గవర్నమెంట్లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి..
6. సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్.. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు.. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు.. సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు. మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు.. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు.. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్‌తో.. ఆ బెటర్‌గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే..
10. నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌ని.. ఎకనామిక్స్ గురించి నాకు ABCD కూడా తెలియదు.. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వంలో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్‌పర్ట్‌తో నేను టీవీ డిబేట్‌కి రెడీ.. మా సినిమా ఇండస్ట్రీకి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ మిస్ అండర్‌స్టాండింగ్‌ను తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం.. థ్యాంక్యూ.. అని తెలిపారు.