Actress Urvashi Brother: అలనాటి తార ఊర్వశి. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమై ఎన్నో సినిమాలలో నటించింది. ఈతరం సినిమాలలో కూడా సహాయ పాత్రలలో నటిస్తుంది. ఇక ఈమెకు ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్ళు ఉండగా అందులో నందు అనే చిన్న తమ్ముడు శృంగార భరితమైన లయనం అనే మలయాళ సినిమాలో నటించాడట. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుందట. ఈ సినిమా సమయంలో తమ్ముడు 17 ఏళ్లు ఉండేపాటికి తన అక్కలు, తమ్ముడు ఇలాంటి శృంగారభరితమైన సినిమాలో నటించినందుకు నిలదీశారట. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలలోనే నటించాడట నందు. అయితే 26 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నందు చనిపోయి కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు.