బుల్లితెరపై కొన్నేళ్లుగా చక్రం తిప్పుతోంది యాంకర్ సుమ (Suma Kanakala). మాటల మహారాణిగా కీర్తించబడుతూ ఎన్నో షో ద్వారా చిన్నితెర ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తోంది. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వుల హంగామా చేస్తోంది. అయితే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే సుమ.. తొలిసారి కెమెరా ముందు ఎమోషనల్ కావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమోలో (Cash Latest Promo) ఊహించని ఘటన కనిపించింది. సీనియర్ నటీనటులు సుభాషిణి, జెన్నీ, బాలజీ, కృష్ణవేణి క్యాష్ షోకి అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ గొప్ప మనసు గురించి తెలుపుతూ కొన్ని నిజ జీవిత సంఘటనలను బయటపెట్టి కంటతడి పెట్టుకుంది సీనియర్ నటి సుభాషిణి.