నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటు రాజకీయాలతో పాటు.. అటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా మారారు. అయితే ఈ క్రమంలో బాలయ్య ఓటీటీలోకి వచ్చి అందర్నీ షాక్ ఇచ్చారు. బాలయ్య చేస్తున్న ప్రముఖ ఓటీటీ షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజాగా నాలుగో ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. అయితే ఆయనతో పాటు.. , ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నాల్గవ ఎపిసోడ్ నవంబర్ 18న ప్రీమియర్గా ప్రసారం కానుంది .
అయితే అన్స్టాపబుల్ షోలో కిరణ్, సురేష్ రెడ్డితో పాటు మరో అతిథి కూడా రానున్నారని ఇప్పుడు వాార్తలు వస్తున్నాయి. ఆ సీనియర్ నటి ఎవరో కాదు.. రాధిక శరత్ కుమార. రాధిక కూడా ఇప్పుడు ఈ షోలో కనిపంచనున్నారు. మరో పోస్ట్ లో రాధికా శరత్ కుమార్ పవర్ ప్యాక్డ్ సెల్ఫీ ను పోస్ట్ చేయడంతో ఈ వార్త కాస్త వైరల్ అయ్యింది.