నటి మీనా విషయానికి వస్తే తెలుగుతోపాటు తమిళంలో ఎన్నో సినిమాలలో నటించే అగ్రతారంగా కొనసాగిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. మీనా 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ తో పెళ్లి పీటలు ఎక్కారు. విద్యాసాగర్ గత కొద్ది రోజుల నుంచి ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండగా ఈ ఏడాది జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయన మృతి చెందారు