ఒక నటీమణి 'మా' ప్రెసిడెంట్ గా పోటీ పడితే ఈ సారి ఎన్నికలు చాలా వేడివాడిగా మారుతాయి. ఓ వైపు చిరంజీవి అండతో ప్రకాశ్ రాజ్.. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ సహా మరికొందరు సీనియర్ నటుల అండతో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు.. ఇంకోవైపు ఫైర్ బ్రాండ్ జీవిత ముగ్గురు మా అద్యక్ష బరిలో ఉన్నారు. త్రికోణ పోటీలో విజయం ఎవర్ని వరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.