Actor Srikanth tests Corona Positive : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటుడు శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను కోవిడ్-19 పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది అని తెలిపారు. శ్రీకాంత్ ఇటీవల బాలయ్య అఖండ సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాతో పాటు దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ రాబోయే చిత్రం జేమ్స్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. Photo : Twitter
Suresh Gopi మరోవైపు మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీ కరోనా బారినపడిన విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసారు. తనకు తేలికపాటి జ్వరం మాత్రమే ఉంది. జాగ్రత్తలు తీసుకున్న తనకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక దూరం పాటించండి. జన సందోహం ఉన్న చోటికి పోవద్దని విజ్జప్తి చేశారు. మీరు క్షేమంగా ఉండి.. ఇతరలు ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటూ అభిమానులకు చెప్పుకొచ్చారు. (File/Photo)
మరోవైపు టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ తాను ఎన్ని జాగ్రతత్తలు తీసుకున్న కరోనా బారిన పడిన విషయాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు హోం ఐషోలేషన్‌లో ఉంటున్నట్టు పేర్కొంది. ఈమె గతేడాది నటించిన ‘తిమ్మరసు’, ‘SR కళ్యాణ మండపం’ వంటి చిత్రాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. (Priyanka Jawalkar/Instagram)
నటి డింపుల్ హయతీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో పేర్కోన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనావైరస్ బారిన పడినట్లు డింపుల్ హయాతి తన పోస్ట్‌లో తెలిపారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. డింపుల్ హయతీ ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన ఖిలాడీలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పలు తెలుగు తమిళ భాషాల్లో నటిస్తున్నారు డింపుల్.
కీర్తి సురేష్.. ఈ మధ్యే అమ్మడు కరోనా బారిన పడటంతో కాస్త రెస్ట్ తీసుకుంది. 14 రోజుల క్వారంటైన్ తర్వాత బయటికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ తాను పూర్తిగా కోలుకున్నట్లు చెప్పుకొచ్చింది కీర్తి. సురేష్. ఈ సందర్భంగానే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో కీర్తిని చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. ఎందుకంటే ఎప్పుడూ అందంగా కనిపించే ఈ మోడ్రన్ మహానటి.. అందులో చాలా న్యాచురల్‌గా ఉంది. (Instagram/Photo)
లెజెండరీ సింగర్ భారత రత్న లతా మంగేష్కర్ (92) ఇటీవల కోవిడ్ (Covid -19) బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో హాస్పిటల్లో చేరిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. లతా మంగేష్కర్‌కు కోవిడ్‌తో పాటు న్యుమోనియా కూడా వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఆమెను ఎవరు కలవనివ్వడం లేదు వైద్యులు. ఇక ఈ విషయం తెలుసుకున్న లతా మంగేష్కర్ అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. Photo : Twitter
సీనియర్ నటి తమిళుల ఆరాధ్య నటి కుష్బూ తాను.. కరోనా బారిన పడిన విషయాన్ని తెలియజేసింది. గత రెండు వేవ్‌ల నుంచి నేను కరోనా నుంచి తప్పించుకున్నాను. కానీ థర్డ్ వేవ్‌లో మాత్రం కరోనా తనను ఎటాక్ చేసిన విషయాన్ని తెలియజేసింది. కుష్బూ విషయానికొస్తే.. లాక్డౌన్ పుణ్యమా అని ఏకంగా మూడు నెలల్లోనే 15 కిలోలు తగ్గిపోయి షాకింగ్ లుక్‌లోకి మారిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. ఆ తర్వాత కూడా బరుతు తగ్గుతూనే ఉన్నారు ఈమె.
ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శోభన.. తాను కరోనా బారిన పడ్డట్టు తెలియజేసింది. కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చివరకు తాను కోవిడ్ బారిన పడ్డట్టు తెలియజేసింద. తనకు సోకింది.. ఓమ్ని వైరస్ అంటూ చెప్పుకొచ్చారు. స్వతహాగా మలయాళీ అయిన ఈ భామ.. సౌత్ ఇండస్ట్రీలో అందరి అగ్ర హీరోల సరసన నటించింది. (Twitter/Photo)
నటకిరిటి రాజేంద్రప్రసాద్ సైతం కరోనా బారినపడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. స్వల్ప లక్షణాలను గుర్తించడం వల్లే టెస్ట్‌లు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంతా జాగ్రత్తగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. Rajendra prasad Photo :Twitter
Thaman Corona : మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తమన్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలియజేసారు. తనను కలిసి వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోమని తెలియజేసారు. నిన్ననే మహేష్ బాబు తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా తమన్ కరోనా టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా తేలింది. (Twitter/Photo)
తమన్ రెండు మూడేళ్లుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతేడాది ‘క్రాక్’ ‘వకీల్‌సాబ్’, వైల్డ్ డాగ్’, ‘అఖండ’ సహా హిందీలో ‘సూర్యవంశీ’ సహా పలు చిత్రాలకు సంగీతం అందించిన తెలిసిందే కదా. ఏ సినిమా ఫంక్షన్‌కు వెళ్లిన అత్యంత జాగ్రత్తగా ఎక్కడ కరోనా సోకుతుందో ఏమో అని మాస్క్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటారు. అలాంటి తమన్ తాజాగా త్రివిక్రమ్‌తో కలిసి మహేష్ బాబును దుబాయ్‌లో కలిసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా తమన్‌కు కరోనా సోకి ఉండవచ్చని అందరు చెప్పుకుంటున్నారు. ఇక మహేష్ బాబు కరోనా కారణంగా అన్నయ్య రమేష్ బాబు కన్నుమూసిన .. చివరి చూపులకు కూడా నోచుకోలేకపోయారు. ప్రస్తుతం కరోనా నుంచి సూపర్ స్టార్ కోలుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Twitter/Photo)
మంచు లక్ష్మి.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వరస సినిమాలతో పాటు టీవ తెరపై కూడా బిజీగా ఉంటుంది మంచు వారమ్మాయి. ముఖ్యంగా సినిమాలు మాత్రమే కాకుండా హోస్టింగ్గానూ ఈమె చాలా బిజీ. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తన పనులు తాను చేసుకంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది మంచు లక్ష్మి. సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి ట్వీట్స్ ఎప్పటికప్పుడు ఆసక్తిగా ఉంటాయి. ఈమెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజాగా కరోనా నుంచి కోలుకుంది.
అంతకు ముందు మంచు మనోజ్ తనకు కరోనా సోకినట్టు తెలియజేసిన విషయం తెలిసిందే కదా. గతేడాది మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయ భ్రాంతలకు గురి చేసింది. సామాన్య జనాలతో పాటు సినీ జనాలు కూడా కరోనాతో విలవిలలాడారు. 2022 కొత్త యేడాదిలో కూడా కరోనా థర్డ్ వేవ్ ఓమైక్రాన్ రూపంలో దేశంపై విరుచుపడుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. (Manchu Manoj Corona)
కరోనా తాను ఇంకా పోలేదు.. ఇప్పటికీ ఉన్నానని గుర్తు చేస్తూనే ఉంది కరోనా మహామ్మారి(COVID 19). మరోసారి ఇండస్ట్రీపై వేటు వేయడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా అటాక్ చేయడం ఖాయం. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా మీనా కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు.ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. న్యూ ఇయర్ మా ఇంట్లో వచ్చిన కొత్త అతిథి ‘కరోనా’ అంటూ ఛమాత్కరంగా చెప్పుకొచ్చారు. దానికి మా ఫ్యామిలీ అంతా నచ్చేసింది. కానీ ఆ అథితిని మేం త్వరలోనే సాగనంపుతాం అంటూ మీనా చెప్పింది. (Instagram/Photo)
వడివేలు.. తెలుగు ప్రేక్షకులు ఈయన్ని ముద్దుగా తమిళ బ్రహ్మానందంగా పిలుస్తూ ఉంటారు. ఈయన యాక్ట్ చేసిన దాదాపు అన్ని డబ్బింగ్ సినిమాలకు బ్రహ్మానందం వాయిస్ ఇవ్వడంతో ఈయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. రీసెంట్గా కరోనా బారిన పడ్డారు. దాదాపు మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చి తిరిగి మాములు మనిషయ్యారు. (vadivelu comedian)