Murali Mohan: రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీమోహన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాగ చైతన్య పట్టుదల గురించి కొన్ని విషయాలు చెప్పారు.
అక్కినేని వారసుడు నాగ చైతన్య (Naga Chaitanya) కార్లు, బైకులు అంటే మహా ఇష్టమనే సంగతి మనందరికీ తెలుసు. వీటితో పాటు లగ్జరీ అపార్ట్మెంట్స్ని కూడా బాగా ఇష్టపడుతుంటారట చైతూ. సకల సౌకర్యాలతో విలాసవంతంగా ఉండే ఇల్లంటే ఆయనకు చాలా ఇష్టమట.
2/ 10
రిచ్ ఫ్యామిలీ, పైగా సెలబ్రిటీ హోదా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడంతో ముందునుంచి చైతూకి లగ్జరీ లైఫ్ అలవాటే. ఈ క్రమంలోనే హీరోగా సెట్టయిన తర్వాత ఆయన ఓ అపార్ట్మెంట్ పై మనసు పారేసుకున్నారట. చూడగానే బాగా నచ్చడంతో దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు సాధించుకున్నారట.
3/ 10
ఈ విషయాన్ని రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీ మోహన్ వెల్లడించారు. నాగ చైతన్య ఇష్టపడిన సదరు అపార్ట్మెంట్ తనదే అంటూ కీలక విషయాలు చెప్పుకొచ్చారు.
4/ 10
నాగ చైతన్య హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఓ లగ్జరీ హౌస్ కొనేందుకు బాగా వెతికారట. అప్పుడే తన అపార్ట్మెంట్ చూడటానికి వచ్చిన చైతూ.. తమ కోసం 14వ ఫ్లోర్ లో కట్టించుకున్న ఇంటిపై మనసు పడ్డారని మురళీమోహన్ చెప్పారు.
5/ 10
సదరు అపార్ట్మెంట్ 14వ ఫ్లోర్ లో తను, తన కొడుకు కోసం సొంతంగా సకల సౌకర్యాలతో ఇల్లు నిర్మించుకున్నామని.. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్నీ ఉన్నాయని ముసరళీ మోహన్ చెప్పారు. అయితే ఈ ఫ్లోర్ చైతూకి నచ్చడంతో ఇది కొంటానని అన్నారట.
6/ 10
కానీ ఇది తమ కోసం నిర్మించుకున్నాం కాబట్టి అమ్మేది లేదని తాను తేల్చి చెప్పడంతో.. చివరకు నాగార్జునతో ఫోన్ చేయించి నాగ చైతన్య ఆ ఇల్లును సొంతం చేసుకున్నారని మురళీ మోహన్ చెప్పారు.
7/ 10
వాడికి ఏదీ అంత తొందరగా నచ్చదు. నచ్చితే కావాలని పట్టు బడతాడని నాగార్జున చెప్పారని.. ఆయన మాటను గౌరవించి ఆ ఇల్లును చైతూకి అమ్మినట్లు మురళీమోహన్ చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో చైతన్యతో సమంత మాత్రం లేదని చెప్పారు.
8/ 10
కొన్నేళ్లపాటు సమంతతో ప్రేమాయణం నడిపించిన నాగ చైతన్య.. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్ళై నాలుగేళ్లు గడిచాక ఈ ఇద్దరూ అనూహ్యంగా విడిపోయారు. వారి విడాకులకు కారణాలు వ్యక్తిగత సమస్యలే అని సమాచారం.
9/ 10
ఇకపోతే ఇటీవలే బంగార్రాజు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ మూవీ చేస్తున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
10/ 10
మరోవైపు సమంత కూడా వరుస సినిమాలతో బిజీ అయింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల జోష్ పెంచేసి తనకు నచ్చిన పాత్రలు ఎంచుకుంటోంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.