అవన్నీ అమ్మే నేర్పింది... సీక్రెట్ చెప్పిన అదా శర్మ

కమాండో 3 సినిమాలో నటించిన అదా శర్మ... ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేసింది. ఇందుకోసం కలారిపయట్లు, సిలంబం అనే విద్యలను కూడా నేర్చుకుంది. అయితే ఈ విద్యలను ఎవరో గురువు నేర్పించలేదని... తన అమ్మే ఇవన్నీ తనకు నేర్పించిందని అసలు విషయం చెప్పింది అదా. నవంబర్ 29న కమాండో 3 ఆడియెన్స్ ముందుకు రానుంది. బాలీవుడ్‌లో అడపా దడపా ఆఫర్లు దక్కించుకుంటున్న అదాకు తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు.