దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరోవైపు చిరు మరణ: తర్వాత పూర్తిగా ఇంట్లోనే ఉండిపోయింది మేఘన. ఇప్పుడు కొడుకుతో పాటు హాయిగా ఉంటుంది. పోయిన భర్తను కొడుకులో చూసుకుంటుంది ఈమె. అయితే భర్త మరణం తాలూకు చేదు జ్ఞాపకాలు వెంబడించకూడదు అంటే ఏదో ఓ పనిలో ఉండాలని నిర్ణయించుకుంది ఈమె.
మేఘనకు కన్నడలో మంచి ఇమేజ్ ఉంది. అందుకే అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఏదేమైనా కూడా చిరంజీవి మరణం తర్వాత మేఘన తీసుకున్న నిర్ణయంపై కుటుంబ సభ్యులతో పాటు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా ఈ మధ్య కన్నడ ఇండస్ట్రీలో వస్తున్నాయి. వీటిపై సీరియస్ అయింది మేఘనా రాజ్.
మరోవైపు బిగ్ బాస్ 1 కన్నడ విన్నర్‌తో ఈమె ఏడడుగులు నడవబోతుందనే ప్రచారం ఈ మధ్య జరిగింది. ఇందులో ఎలాంటి నిజం లేదని.. లేనిపోని వార్తలు రాసి అనవసరంగా ప్రశాంతత చెడగొట్టొద్దని చెప్తున్నారు మేఘన రాజ్. తనకు అలాంటి ఉద్దేశాలు లేవని.. తన కొడుకు తనకు సర్వస్వం అంటుంది ఈమె. ఆ చిన్నారిలోనే చిరంజీవిని చూసుకుంటున్నట్లు తెలిపింది మేఘనా రాజ్.