Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన నటుడిగా 41 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక హీరోగా 22 యేళ్లు పూర్తి చేసుకున్నారు. బాల నటుడిగా 9 సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. హీరోగా 27 చిత్రాల్లో నటించారు. మొత్తంగా 41 ఏళ్ల కెరీర్లో 36 చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు. రీసెంట్గా ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక మహేష్ బాబు కెరీర్లో రాజకుమారుడు నుంచి సర్కారు వారి పాట వరకు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్స్ రాబట్టాయంటే..
3. వంశీ | బి.గోపాల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి నటించిన మూవీ ‘వంశీ’. హీరో అయిన తర్వాత మహేష్ బాబు, కృష్ణ కలిసి పూర్తి స్థాయిలో కలిసి నటించారు. ఈ మూవీలో మహేష్ జోడిగా నటించిన నమ్రత ఆ తర్వాత అతని రియల్ లైఫ్ పార్టనర్ అయ్యింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక హీరోగా పద్మాలయా బ్యానర్లో మహేష్ బాబు నటించిన ఏకైక చిత్రం ఇదే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.2.2 కోట్ల షేర్ రాబట్టింది. (File/Photo)
4. మురారి | మహేష్ బాబు లోని నటుడిని వెలికితీసిన సినిమా మురారి. కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన ఈ మూవీతో మహేష్ బాబు సోలోగా బంపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంతో మహేష్ కు అటు యూత్ లోను ఇటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా విజయంతో మహేష్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఈ సినిమా రూ. 7 కోట్ల వరకు షేర్ రాబట్టింది. (File/Photo)
5. టక్కరి దొంగ | అందరి హీరోల్లా రొటీన్ గానటించడం మహేష్ అస్సలు నచ్చదు. తండ్రి కృష్ణలాగే మహేష్ బాబు డేరింగ్ డాషింగ్. ఆ రూట్లోనే మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరిదొంగ. ఈ సినిమా టెక్నికల్ గా బాగా రిచ్ గా ఉన్నా...కథనం స్లోగా ఉండటంతో ఈ సినిమా సరైన సక్సెస్ సాధించలేదు. ఈ చిత్రాన్ని జయంత్ సి. పరాన్జీ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో మహేష్ నటనకు.. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 4.8 కోట్ల వరకు రాబట్టింది. (File/Photo)
7. ఒక్కడు | గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ’ఒక్కడు’ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఈ సినిమా యాక్టర్ గా మహేష్ ను ఒకమెట్టు పైకెక్కెలా చేసింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 21 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
8. ‘నిజం’ | సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోపీచంద్ విలన్‌గా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ నిజం. ఒక్కడు సక్సెస్ తర్వాత మహేష్ చేసిన మూవీ నిజం. అవినీతి పై పోరాడే యువకుడిగా మహేష్ నటన ఆకట్టుకుంటుంది. ఈ మూవీతో మహేష్ తొలిసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. రక్షిత హీరోయిన్గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 8 కోట్ల షేర్ రాబట్టి ఫ్లాప్‌గా నిలిచింది. (File/Photo)
9. నాని | సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన మరో ప్రయోగం నాని. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్న ఇక్కడి ఆడియన్స్ కు కనెక్ట్ కాలేకపోయింది. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. ఈ సినిమాలో మహేష్ లోని నటున్నివిభిన్నకోణంలో ఆవిష్కరించింది. ఈ సినిమా అప్పట్లోనే రూ. 4 కోట్ల షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
11. అతడు | హీరోగా సాఫ్ట్ రోల్సే కాదు అన్నిరకాల పాత్రలు పోషించి మెప్పించగలనని ‘అతడు’ మూవీతో నిరూపించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ తో పలికించిన డైలాగులు ఆడియన్స్ కు మెస్మరైజ్ చేశాయి. స్వతహాగా మంచి వాడైనా...పరిస్థితుల వలన ప్రొఫెషనల్ కిల్లర్ గా మారుతాడు. ఈ సినిమాలో ప్రిన్స్ పలికిన ఎక్స్ ప్రెషన్స్ ఈ మూవీ విజయానికి పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో నటకు రెండోసారి నంది అవార్డు అందుకున్నాడు మహేష్ బాబు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 17.3 కోట్ల షేర్ రాబట్టి హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
12. పోకిరి | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో పండుగాడు కాస్త సూపర్ స్టార్ అయ్యాడు. ఈ సినిమాలో పండుగాడిగా మహేష్ బాబు యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ డైలాగ్ తో హోల్ ఏపి మహేష్ మేనిలోకి జారుకుంది. పూరి సంభాషణలకు ప్రిన్స్ పలికిన డైలాగులు బాగా పేలాయి. ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా బాక్సాఫీసు రికార్డలన్నిటిని ఈజీగా క్రాస్ చేసింది. ఇక మహేష్ కెరీర్ చెప్పాలంటే పోకిరి కి ముందు పోకిరి తర్వాత అనేంతగా మారిపోయింది. ఈ సినిమాతో పండుగాడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 40 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగులో తొలి రూ. 40 కోట్ల షేర్ రాబట్టిన సినిమాగా చరిత్ర లిఖించుకుంది. (Twitter/Photo)
13. సైనికుడు | పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సైనికుడు’. అంతేకాదు మహేష్ బాబు తొలిసారి ఓ హీరోయిన్ను తన సినిమాలో రిపీట్ చేసారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీకి గుణ శేఖర్ దర్శకుడు అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 18 కోట్ల షేర్ రాబట్టి ఫ్లాప్‌గా నిలిచింది. (Twitter/Photo)
16. దూకుడు | శ్రీను వైట్ల డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేసిన మూవీ ‘దూకుడు’. ఈ మూవీ మహేశ్ కెరీర్ లోనే భారీ విజయంగా నిలబడింది. మహేశ్ నటనకు తమన్ సంగీతం ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలబెట్టింది. మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్ గా దూసుకుపోతా లాంటి డైలాగులతో పాటు... మహేశ్ పండించిన యాక్షన్ ప్లస్ కామెడీ టైమింగ్ ఈ చిత్రాన్ని హిట్ గా నిలబెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 56 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Photo : Twitter)
20. ఆగడు | శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండోసారి హీరోగా నటించిన మూవీ ‘ఆగడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపైంది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రూ. 34 కోట్ల షేర్ రాబట్టి ఫ్లాప్‌గా నిలిచింది. (Twitter/Photo)
22. బ్రహ్మోత్సవం.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి హీరోగా నటించిన మూవీ ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్ల షేర్ రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. (File/Photo)
23.స్పెడర్.. | మహేష్ బాబు హీరోగా ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘స్పైడర్’. ఈ సినిమా మహేష్ బాబు తొలి బై లింగ్వల్ మూవీ. డిజాస్టర్ టాక్‌తో కూడా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్ల షేర్ రాబట్టి ఫ్లాప్‌గా నిలిచింది. (Twitter/Photo)
24. భరత్ అను నేను.. శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన రెండో చిత్రం ‘భరత్ అను నేను. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి అమెరికాలో మహేష్ బాబు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్ల షేర్ రాబట్టింది. (Twitter/Photo)
11. సర్కారు వారి పాట.. టాలీవుడ్లో 1 మిలియన్ యూఎస్ డాలర్ వసూళ్లు చేసిన హీరోల్లో మహేష్ బాబుదే అగ్రస్థానం.ఇక సర్కారు వారి పాట సినిమా యూఎస్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాల్లో 11వ కావడం విశేషం. అక్కడ మహేష్ బాబుకు ఇది నాలుగో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక దక్షిణాది నుంచి యూఎస్ మార్కెట్లో 2 మిలియన్ వ్యూస్ అందుకున్న నాల్గో దక్షిణాది హీరోగా నిలిచారు. ఈయన కంటే ముందు రజినీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలు నాలుగు అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేశాయి. ఈ చిత్రం ఓవరాల్‌గా వరకు రూ. 108 కోట్ల వరకు రాబట్టి.. ఇంకా రేసులో ఉంది.
ఈ సినిమా 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో సర్కారు వారి పాట థియేట్రికల్ రన్ మగిసింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా రూ. 110.12 కోట్లు వసూళ్లు చేసింది. ఇక బ్రేక్ ఈవెన్‌కు రూ. 10.88 కోట్ల దూరంలో ఆగిపోయింది. అంతేకాదు మొత్తంగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా 91 శాతం రికవరీ పూర్తి చేసుకొని అబౌ యావరేజ్ మూవీగా నిలిచింది. సర్కారు వారి పాట ఒక్క ఓవర్సీస్ తప్ప ఎక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావలేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, రెస్టాఫ్ భారత్ ఎక్కడ లాభాల్లోకి రాలేదు. (Twitter/Photo)