టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలిసొచ్చింది. తాజాగా కర్నూలులో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు ఆనందంగా పాల్గొని తమన్‌తో కలిసి సర్కారు వారి పాట సినిమాలోని పాటలకు చిందేలేసారు. (Twitter/Photo)
‘సర్కారు ారి పాట’ సక్సెస్ నేపథ్యంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఇది సక్సెస్ సెలబ్రేషన్‌లా లేదు. వంద రోజుల వేడుక చేసుకున్నట్టుగా ఉందంటూ వ్యాఖ్యానించారు. సర్కారు వారి పాట విజయం తనతో పాటు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. పరశురామ్ దర్శకత్వంల తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్ట్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న విడుదలైన ఈ సినమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. (Twitter/Photo)
ఇక ఒక్కడు సినిమా షూటింగ్ జరిగిపుడు కర్నూలు వచ్చానన్నారు. తాజాగా సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్ కోసం ఇక్కడకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఐతే.. ఈ సక్సెస్ మీట్‌కు ఇంత మంది అభిమానులు వస్తారని అనుకోలేదన్నారు. మీ అందరి ఉత్సాహంతో స్టేజ్ పై డాన్స్ చేశానన్నారు. మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలన్నారు మహేష్ బాబు. ఇది సక్సెస్ మీట్‌లా లేదు వంద రోజుల తర్వాత వేడుకల ఉందన్నారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత తన అబ్బాయి గౌతమ్ తనను హగ్ చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్ని సినిమాల్లో కంటే ఇందులో తాను బాగా నటించానని తన కూతురు సితార చెప్పిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం దర్శకుడు పరశురామ్‌కు దక్కుతుందన్నారు మహేష్ బాబు . (Twitter/Photo)
ఇక దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. ఒక్కడు సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఏ హీరోను చూసి సినిమా ఇండస్ట్రీకి వచ్చానో.. ఆయనతో సినిమా చేయడం తన లైఫ్ టైమ్ అఛీవ్మెంట్. ఆయన సినిమా చేయడం కల అయితే.. అది సక్సెస్ కావడం మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సినిమా కోసం నాకు ఛాన్స్ ఇవ్వడం తన అదృష్టమన్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడం.. అది కర్నూలులో నిర్వహించడం.. నాకు లైఫ్ టైమ్ గిఫ్ట్ అన్నారు పరశురామ్. (Twitter/Photo)
హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. ‘సర్కారు వారి పాట’ ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక నాలుగు రోజుల్లో వాల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ. 85.87 కోట్లు (రూ. 133.80 కోట్లు గ్రాస్). మొత్తంగా ఈ సినిమా రూ. 35.13 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.మొత్తంగా టోటల్ బాక్సాఫీస్ రన్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. (Twitter/Photo)