టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని కళావతి సాంగ్ లీకవ్వడంతో ముందుగానే ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
ఇటీవల స్పెయిన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం.. తుది షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పాటను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయాలనీ టీమ్ భావించినా.. చేసేదేం లేక ఒకరోజు ముందుగానే విడుదల చేసింది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. (Twitter/Photo)
థమన్ సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్.. మరోవైపు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఆయా సినిమాలేని కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడదలను పోస్ట్‌పోన్ అయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్తోొ దూసుకుపోతుంది. (Twitter/Photo)
సర్కారు వారి పాట షూటింగ్ విషయానికి వస్తే.. దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సముద్ర ఖని తెలుగుతో పాటు తమిళంలో పలు సినిమాల్లో నటించి అలరించిన సంగతి తెలిసిందే. (Twitter/Photo)