Sarkaru Vaari Paata 1st Day Collections : సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదల కానుంది. హీరోగా 27వ చిత్రం. నటుడిగా 36వ సినిమా. (Twitter/Photo)
ఇక మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో వస్తోన్న ఫస్ట్ మూవీ. గతంలో మహేష్ బాబు తనతో ఫస్ట్ మూవీ చేసిన రాఘవేంద్రరావుతో ‘రాజకుమారుడు’.. కృష్ణవంశీతో ‘మురారి’... గుణశేఖర్‌తో ‘ఒక్కడు’ వంటి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక త్రివిక్రమ్‌తో ‘అతడు’.. అటు పూరీ జగన్నాథ్‌తో ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ అందుకుంటే.. శ్రీనువైట్లతో తొలి చిత్రం ‘దూకుడు’తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక శ్రీకాంత్ అడ్డాలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. అటు కొరటాల శివతో ‘శ్రీమంతుడు’.. వంశీ పైడిపల్లితో ‘మహర్షి’ .. అనిల్ రావిపూడితో ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి తనతో ఫస్ట్ మూవీ చేసిన దర్శకులతో భారీ విజయాలను అందుకున్నారు మహేష్ బాబు. అదే కోవలో పరశురామ్‌తో చేస్తోన్న తొలి చిత్రం ‘సర్కారు వారి పాట’తో భారీ విజయాన్ని అందుకుంటారా అనేది చూడాలి. (Twitter/Photo)
అటు మహేష్ బాబు తొలి సినిమా చేసిన వైవియస్ చౌదరితో ‘యువరాజు’. బి.గోపాల్‌తో చేసిన ‘వంశీ’. జయంత్‌తో చేసిన టక్కరి దొంగ,.. శోభన్‌తో చేసిన ‘బాబీ’... దర్శకుడు తేజతో చేసిన తొలి చిత్రం నిజం.. ఎస్.జే.సూర్యతో చేసిన ‘నాని’.. సురేందర్ రెడ్డితో చేసిన అతిథి.. సుకుమార్‌తో చేసిన ‘వన్ నేనొక్కడినే’ వంటి దర్శకులు మహేష్ బాబుకు ఫస్ట్ కాంబోలోనే రాడ్ రంబోలా వంటి డిజాస్టర్స్ కూడా ఇచ్చారు. Mahesh Babu Photo : Twitter
‘సర్కారి వారి పాట’ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా అనిల్ కపూర్.. ఆ తర్వాత ఉపేంద్ర పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సముద్రఖనిని ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. ముఖ్యంగా కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది. ఈ మధ్యలో మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ సినిమా షూటింగ్‌లోనే మహేష్ బాబు తను ఎంతో ప్రేమించే అన్నయ్య రమేష్ బాబు కాలం చేసారు. (Twitter/Photo)
గతంలో మహేష్ బాబు నటించిన బాబీ, సైనికుడు, అతిథి, ఖలేజా, మహర్షి, సినిమాలు గురువారం విడుదలైయ్యాయి. అందులో మహర్షి ఒకటే సూపర్ హిట్టైయింది. మిగతావేవి సక్సెస్ సాధించలేదు. ఇపుడు గురువారం విడుదలవుతున్నమహేష్ బాబు ఆరో చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. (Twitter/Photo)