సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత మహేష్ బాబు అభిమానులను పలకరించారు. వారి అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
‘సర్కారు వారి పాట’ సినిమాలో ఇప్పటి వరకు ఎన్నడు చూడనటు వంటి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమాలో కళావతి సాంగ్‌తో పాటు చివరగా విడుదలైన మాస్ సాంగ్, మ..మ.. మహేశాకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ స్టెప్స్‌లతో ఇరగదీసింది. కలర్ ఫుల్ కాస్టూమ్స్‌తో అదరగొట్టే స్టెప్స్‌తో వావ్ అనిపించారు మహేష్ బాబు, కీర్తి సురేష్. (Twitter/Photo)
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచికళావతి (Kalaavathi song)అనే సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ (Thaman) సంగీతం అందించారు. పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది.
ఇక మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో వస్తోన్న ఫస్ట్ మూవీ. అటు హీరోయిన్ కీర్తి సురేష్‌తో కూడా మహేష్ బాబుకు ఇదే తొలి చిత్రం. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రెండో చిత్రం.. 14 రీల్స్ సంస్థలో 3వ మూవీ. మొత్తంగా దర్శకుడు, హీరో, హీరోయిన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘సర్కారు వారి పాట’కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. (Twitter/Photo)
‘సర్కారి వారి పాట’ సినిమాలో విలన్ పాత్ర కోసం ముందుగా అనిల్ కపూర్.. ఆ తర్వాత ఉపేంద్ర పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా సముద్రఖనిని ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. ముఖ్యంగా కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది. ఈ మధ్యలో మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు.
ఇక మహేష్ బాబు, తమన్ కాంబినేషన్లో వస్తోన్న నాల్గో చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇక వీళ్ల కాంబినేషన్లో గతంలో దూకుడు ‘బిజినెస్‌మేన్’, ఆగడు చిత్రాలొచ్చాయి. ఇక పరశురామ్ కాంబినేషన్లో తమన్ ‘ఆంజనేయులు’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాలకు స్వరాలు అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ‘సర్కారు వారి పాట’ ఏ రేంజ్లో హిట్‌గా నిలుస్తుందో చూడాలి. (Twitter/Photo)