Mahesh Babu - Sudheer Babu - Tollywood Brother In Laws | తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి తనయులే కాదు.. అన్నదమ్ములు కూడా హీరోలుగా, నిర్మాతలుగా రాణించారు. మరోవైపు బావ బామ్మర్ధులు కూడా హీరోలుగా, నిర్మాతలుగా సత్తా చూపెట్టారు. వీళ్లలో మహేష్ బాబు, సుధీర్ బాబులు కూడా ఉన్నారు. సుధీర్ బాబు కూడా బామ్మర్ధి మహేష్ బాబు బాటలో కాకుండా.. తనదైన శైలిలో హీరోగా దూసుకుపోతున్నారు. (File/Photos)
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ధి నితిన్ చంద్ర కూడా హీరోగా సతీస్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ టైటిల్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తారక్ భార్య లక్ష్మి ప్రణతికి స్వయంగా తమ్ముడు.ఈ సినిమాను ‘శతమానం భవతి’, ‘ఎంత మంచివాడవురా’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. (File/Photos)
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ - నారా రోహిత్ | ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు నారా రోహిత్ వరుసకు బావ అవుతారు. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపెట్టనున్నారు. కళ్యాణ్ రామ్ కూడా డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక నారా రోహిత్ మాత్రం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. (file/Photo)