1 RRR | ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం సాధించింది. ఒక తెలుగు వాడైన రాజమౌళి.. బాహుబలి తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు. ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో తొలిరోజు రూ. 23.35 కోట్ల రికార్డు కలెక్షన్స్‌తో అన్ని రికార్డులను మటాష్ చేసింది. ఇక సీడెడ్, ఏపీలో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ. 70 కోట్ల వరకు షేర్ రాబట్టింది. మొత్తంగా నైజంతో పాటు ఏపీ, తెలంగాణలో ఈ సినిమా హైయ్యస్ట్ ఫస్ట్ డే గ్రాసర్‌గా టాప్ 1లో ఉంది. (Twitter/Photo)
2.సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మొదటి రోజు తెలంగాణ, ఏపీలో మంచి వసూళ్లనే సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 36.01 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణలో ఈ సినిమా రూ. 12.24 కోట్ల షేర్ రాబట్టి ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో నిలిచింది.