టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. (Twitter/Photo)
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రైమ్ దాదాపు రూ. 50 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. కేవలం తెలుగుకే కాకుండా.. హిందీ మిగతా భాషల్లో ఈ సినిమా డబ్ చేసి స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనతోనే ఇంత భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను కొనుగోలు చేసినట్టు సమాచారం. Sarkaru Vaari Paata ott Twitter
యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు పాటు నేత విజయ సాయి రెడ్డి ఈ సినిమాపై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఎవరో అనే విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది. సర్కారు వారి పాట ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకు అంటే జూన్ 10న స్ట్రీమింగ్ రానుందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన చేయనున్నారు. . Photo : Twitter
ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆట మొదలైంది. అంతేకాదు ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అప్పుడే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినిమా మంచి కమర్షియల్ హిట్కానుందని అంటున్నారు. మాస్ మసాలా ఫార్మూలా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. దీంతో మహేష్‌కు మరో హిట్ దొరికిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. Photo : Twitter
గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, 4 కోట్లకు ఇక ఏపీ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది." width="913" height="1280" /> ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. Photo : Twitter
ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 38 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. మరోవైపు యూఎస్.. ఇతర ఓవర్సీస్ లెక్కలు చూసుకుంటే.. ఈ సినిమా మొదటి రోజు రూ. 50 కోట్ల షేర్.. (రూ. 80 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. Photo : Twitter
ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటిస్తున్నారు. ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టారనేది కథాంశం. కథ విషయానికి వస్తే.. మహేష్ (మహేష్ బాబు) యుఎస్‌లో లోన్ రికవరీ వ్యాపారంలో ఉంటాడు. కళావతి (కీర్తి సురేష్) అనే అమ్మాయి అతని దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమవుతుంది. దీంతో మహేష్ ఆమెను హెచ్చరిస్తాడు. అయితే కళావతి తన తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని)ని పిక్చర్లోకి తీసుకువస్తుంది. దీంతో మహేష్ తన డబ్బును తిరిగి పొందడానికి ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. Photo : Twitter