ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత భారీ అంచనాల నడుమ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా చేశారు. థమన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తంగా 120 కోట్లకు జరిగిందని తెలుస్తోంది. నైజాంలో 36 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది. సీడెడ్ 13 కోట్లకు, ఉత్తరాంధ్ర 12. 50 కోట్లకు.. ఈ స్ట్ 8.50 కోట్లకు, వెస్ట్ 7 కోట్లకు, గుంటూరు 9 కోట్లకు, కృష్ణ 7.50 కోట్లకు, నెల్లూరు 4 కోట్లకు ఇక ఏపీ తెలంగాణ మొత్తంగా 96. 50 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక కర్నాటక 8.50 కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లకు, ఓవర్సీస్ 11 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. Photo : Twitter
మొత్తంగా 120 కోట్లకు అమ్ముడు పోయింది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 121 కోట్లు రావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ’మురారి వా’ అనే ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఈ సినిమా జూన్ 23న నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.. Photo : Twitter
అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సాధించి కేక పెట్టిస్తోంది. ఇక రెండవ సింగిల్‌గా వచ్చిన పెన్నీ సాంగ్ (Penny Music Video) కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఈ పాట సూపర్ స్టైలీష్‌గా ఉంటూ.. ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఆ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా... అనంత శ్రీరామ్ రాశారు. Photo : Twitter
ఇక కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో కూడా నటిస్తుంది. (Bhola Shankar )భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకుడు. రాఖీ పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్లు రీవిల్ చేసింది చిత్రబృందం. ఇక అది అలా ఉంటే కీర్తి సురేష్ ఓ హిందీ సినిమా తెలుగు రీమేక్’లో నటించనుందని తెలిసింది. Photo: Instagram
హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. హిందీ మిమీలో కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్ర పోషించింది. కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట. Photo: Instagram
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సరోగసీ అనే పద్దతి ద్వారా ఓ పిల్లలు లేని ఓ విదేశీ జంటకు బిడ్డను కని ఇవ్వడం అనేది కాన్సెప్ట్.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన ఓ పెళ్లి కాని యువతి కథే ‘మిమీ’. చూడాలి మరి తెలుగు తమిళ భాషాల్లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక కీర్తి (Keerthy Suresh good luck sakhi)నటించిన మరో సినిమా గుడ్ లక్ సఖీ.. ఈ సినిమా జనవరి 28 2021న విడుదల అయ్యింది. Photo: Instagram