పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్‌కుమార్ లాగే తండ్రి, అన్నయ్యలు మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయినా.. వాళ్లు తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కార్తి వాళ్ల అన్న సూర్య తమిళంలో పెద్ద సూపర్ స్టార్ అయినా.. కార్తి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్న అన్న ఇమేజ్‌కు భిన్నంగా గుర్తింపు తెచ్చుకోవడ మాములు విషయం కాదన్నారు. (Twitter/Photo)
కార్తి లాంటి నటుడిని తాను చూడలేదున్నారు. ఏ సినిమా తీసుకున్న డెడికేషన్‌తో పనిచేస్తాడు. పాటలు పాడతాడు. తెలుగులో ఆయన సినిమాలకు ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటాడు. అందుకే తెలుగు ప్రేక్షకులకు కార్తి అంటే విపరీతమైన అభిమానం. ఆయన నటించిన ‘సర్ధార్’ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్నారు. (Twitter/Photo)
ఇక కార్తి కూడా ఈ యేడాది మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా సక్సెస్‌తో పూర్తి దూకుడు మీదున్నారు. ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ.. నాగార్జున అన్నయ్య తనకు స్పూర్తి అన్నారు. మంచి మంచి వ్యక్తిగా ఉంటే మంచి నటుడు కావొచ్చని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు నాకు వేదవాక్కు. ఆయన చెప్పిన మాటలను తూచా తప్పుకుండా పాటిస్తున్నాను. (Twiitter/Photo)
‘సర్ధార్’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది. . ఈ చిత్రంలో కార్తి తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేసారు. ఇందులో చంద్రబోస్ (సర్ధార్) పాత్రలో కనిపించనున్నారు. ఎక్స్ రా ఆఫీసర్ పాత్రలో కనిపంచనున్నారు . రెండోది సర్ధార్ కొడుకు ఇన్స్పెక్టర్ విజయ ప్రకాష్ పాత్రలో కనిపించనున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తంగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో కార్తి సరసన రాశీ ఖన్నా..రజిషా విజయన్ హీరోయిన్ పాత్రల్లో కనిపంచనున్నారు. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాతో కార్తి మరో సక్సెస్‌ను అందుకుంటాడా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)