Sara Ali Khan : సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ‘కేదార్నాథ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సారా.. రణ్‌వీర్‌సింగ్ సరసన నటించిన 'సింబా'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సారా అలీ ఖాన్ (Sara Ali Khan).. బాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు. చేసింది అతి కొన్ని సినిమాలే అయినా.. బాలీవుడ్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోయిన్స్‌లో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. ఈమె తల్లి అమృతా సింగ్ బాలీవుడ్ అగ్ర హీరోయిన్గా అలరించిన సంగతి తెలిసిందే కదా. (Instagram/Photo)
సైఫ్ అలీ ఖాన్‌కి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్. ఇన్స్టాగ్రామ్ లో సారా అలీఖాన్‌కు దాదాపు 38.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. గ్లామర్ కూడా తోడు కావడంతో సారా అలీ ఖాన్ చూపులకు కుర్రాళ్లు తప్పించుకోలేకున్నారు.
ప్రస్తుతం సారా కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇక సారా తన ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. కేదార్ నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహాన్ తో ప్రేమలో ఉందని, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. సినిమాల్లోకి రాకముందు సారా అలీ ఖాన్ విపరీతమైన బరువు సమస్యతో బాధపడేది. 96 కిలోల వరకు లావుగా తయారైన సారా అలీ ఖాన్ని.. ఇప్పుడు ఇలా స్లిమ్‌గా, ఎంతో ఫిట్‌గా తయారైంది. (Instagram/Photo)
సారా అలీ ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటంటే.. నిత్యం గంటన్నరకుపైగా ఎక్సర్‌సైజులతోనే వ్యాయమం చేయడం సారా అలీ ఖాన్‌కి అలవాటు. అందులోనూ ఏరోజుకు ఆరోజు కొత్త కొత్త ఎక్సర్సైజెస్ ట్రై చేయడం అంటే సారాకు మరింత ఇష్టం. గతేడాది సారా అలీ ఖాన్.. అక్షయ్ కుమార్, ధనుశ్లతో కలిసి ‘అతరంగీ రే’ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో తొలిసారి తల్లీ కూతుళ్లుగా నటించి అలరించింది. (Instagram/Photo)