Sankranti Winners: ప్రతీ ఏడాది సంక్రాంతికి కనీసం రెండు మూడు సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఒకటి మాత్రం కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం. అలా గత 25 ఏళ్లలో ఎన్నో సంచలన సినిమాలు పండక్కి వచ్చాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయి. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి నుంచి తాజాగా 2023 వరకు వచ్చిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతి హిట్స్‌గా నిలిచాయి. ఇందులో బాలయ్య వీరసింహారెడ్డి .. మాములు విజయం సాధిస్తే.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సంచలన విజయం సాధించింది. మొత్తంగా ఈ సారి 2023 సంక్రాంతి బరిలో బాలయ్యపై చిరు పై చేయి సాధించాడనే చెప్పాలి.
వాల్తేరు వీరయ్య | 2023 సంక్రాంతి బరిలో విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాబీ దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర రూ. 126 కోట్ల షేర్ ( రూ. 216 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.2023లో తొలి హిట్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. టోటల్ రన్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. (Twitter/Photo)