Sankranti Winners: ప్రతీ ఏడాది సంక్రాంతికి కనీసం రెండు మూడు సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఒకటి మాత్రం కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం. అలా గత 25 ఏళ్లలో ఎన్నో సంచలన సినిమాలు పండక్కి వచ్చాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయి. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి నుంచి 2022లో వచ్చిన బంగార్రాజు వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపాయి. అలా గత 20 యేళ్లకు పైగా టాలీవుడ్‌లో వచ్చిన విజయాలు.. సంక్రాంతి విజేతలను ఇప్పుడు చూద్దాం..