తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్’కు టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. సినిమా ఏమాత్రం బాగున్నా వసూళ్ల వర్షం కురుస్తుంది. 2021, 2022 కరోనా సమయంలో పెద్ద చిత్రాలు రిలీజ్ కాలేకపోయాయి. ఇక 2023 యేడాదిలో మాత్రం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి తో పాటు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో పాటు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ మూవీలు ఒక రోజు గ్యాప్‌లో ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 1200 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో తెలంగాణలో 400 స్క్రీన్స్ ఉంటే.. అందులో 215 వరకు ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇక ఏపీ మొత్తం కలిపి 800 దాకా ఉన్నాయి. వీటిలో ఏయే సినిమాలకు ఎన్ని థియేటర్స్ దక్కనున్నాయో ఇప్పటికే ఫిక్స్ అయినట్టు ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. (Photo : Twitter)
అటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’కి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 800 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. ఒక రకంగా ఈ సీజన్లో ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కాబోతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’ కావడం విశేషం. ఈ సినిమాలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. బాల నరసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాలో జై బాలయ్య సాంగ్ పెట్టారు. (Twitter/Photo)
జనవరి 13న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు వీరసింహారెడ్డికి కేటాయించిన 800 నుంచి 400 స్క్రీన్స్ దీనికి కేటాయించనున్నారు. అటు విజయ్ .. వారసుడు నుంచి 120 స్క్రీన్స్ లాగేసుకుని వాల్తేరు వీరయ్యకు కేటాయించనున్నారు. అటు అజిత్ నుంచి 50 స్క్రీన్స్ కూడా చిరంజీవి మూవీకే దక్కనున్నాయి. మొత్తంగా వాల్తేరు వీరయ్య తెలుగులో 570 స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో చిరు.. సీక్రెట్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. ఒక రకంగా సవతి సోదరుల కథగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు సమాచారం. ఇందులో సవతి సోదురులుగా చిరు, రవితేజలు కనిపించనున్నారు. (Twitter/Photo)
ఏది ఏమైనా సంక్రాంతి బరిలో ముఖ్యమైన పోటీ తెలుగు సీనియర్ ప్రత్యర్థులైన చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉండనుంది. అజిత్, విజయ్ సినిమాలను కూడా తీసి పారేడానికి లేవు. ముఖ్యంగా విజయ్ ‘వారసుడు’ సినిమాను తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వీటిలో ఏ సినిమాకు హిట్ టాక్ వచ్చిన వసూళ్లు మాత్రం మాములుగా ఉండవు. ఏది ఏమైనా సంక్రాంతి బరిలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందనేది చూడాలి. (Twitter/Photo)