Sankranti movies: క్రిస్మస్ పండగ ముందు నుంచి తెలుగు తెరపై సినిమాలు సందడి చేయబోతున్నాయి. క్రిస్మస్ టూ సంక్రాంతి ఈ నెల రోజుల్లోనే దాదాపు 8 భారీ సినిమాలు విడుదల కానున్నాయి. మార్కెట్ పరంగా చూసుకుంటే బిజినెస్ కూడా 1000 కోట్లకు పైగానే జరుగుతుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా ఒక వారం ముందు జవనరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో మరోసారి సంక్రాంతి వార్ మరోసారి హీట్ ఎక్కింది. (Twitter/Photo)
సంక్రాంతి సీజన్ అంటే సినిమాలు ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ పండక్కి సినిమాలు వరసగా వస్తూనే ఉంటాయి. గతేడాది నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది కరోనా సమయంలో కూడా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇపుడు ఆర్ఆర్ఆర్ రాకతో ఈ హీట్ మరింత వేడెక్కింది. ఇప్పుడు 2000 సంక్రాంతికి కూడా ఇదే జరగబోతుంది. ఈ సారి కూడా 6 సినిమాలు వస్తున్నాయి. మరో మూడు సినిమాలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా క్రిస్మస్ దగ్గర్నుంచి సినిమాలు సందడి చేయబోతున్నాయి. క్రిస్మస్ టూ సంక్రాంతి ఈ నెల రోజుల్లోనే దాదాపు 8 పైగా భారీ సినిమాలు విడుదల కానున్నాయి. మార్కెట్ పరంగా చూసుకుంటే బిజినెస్ కూడా రూ. 1000 కోట్లకు పైగానే జరుగుతుంది. కరోనా అడ్డుకోకపోతే క్రిస్మస్ నుంచే సినిమా పండగ షురూ కానుంది.
జనవరి 7 | రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ఆలియా భట్, ఒలివియా మోరీస్, హీరోయిన్స్‌గా నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎట్టకేలకు వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న బాక్సాఫీస్ బరిలో దింపుతున్నారు. దీంతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ రాకతో సంక్రాంతి పోటీలో ఎన్ని సినిమాలు మిగులుతాయో అన్నది చూడాలి. మొత్తంగా రాజమౌళి ఒక్క నిర్ణయంతో మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్ హీట్ ఎక్కింది. (Twitter/Photo)
జనవరి 13 | సర్కారు వారి పాట: 2022 సంక్రాంతికి అందరికంటే ముందు బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న హీరో మహేష్ బాబు. చాలా రోజుల కింద షూటింగ్ మొదలు పెట్టినపుడే సర్కారు వారి పాట సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నట్లు కన్ఫర్మ్ చేసాడు సూపర్ స్టార్. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. మహేష్ సరసన ఇందులో కీర్తి సురేష్ నటిస్తుంది. ఆర్థిక నేరాల చుట్టూ సాగే ఈ కథలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ హైలైట్ గా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా 100 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
జనవరి 14 | రాధే శ్యామ్: పాన్ ఇండియన్ హీరో ప్రభాస్ సైతం ఈ సారి పండగ బరిలోనే జనవరి 14న వస్తున్నారు. వర్షం, యోగి లాంటి సినిమాలతో గతంలో సంక్రాంతి బరిలో నిలిచాడు ప్రభాస్. ఒక్క వర్షం సినిమా మాత్రమే అంచనాలు అందుకుంది. మిగిలిన సినిమాలు నిరాశ పరిచాయి. చాలా ఏళ్ళ తర్వాత మరోసారి పండక్కే వస్తున్నాడు ప్రభాస్. ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ షూటింగ్ ఇప్పటికే పూర్తైపోయింది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్. 150 కోట్ల బడ్జెట్ తో అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు నిర్మాతలు. ప్రేమకథగా వస్తున్న రాధే శ్యామ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. (Twitter/Photo)
జనవరి 12 | అయ్యప్పునుమ్ కోశియుమ్ రీమేక్: పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో అన్నింటి కంటే ముందు విడుదల కానున్న సినిమా అయ్యప్పునుమ్ కోశియుమ్ రీమేక్. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా ఈ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. (Twitter/Photo)
అయితే ఆయన దర్శకుడైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. దీనికి స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నది కూడా ఈయనే. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ కూడా 40 శాతం పూర్తయింది. దాదాపు 100 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది ఏకే రీమేక్. పవన్ కూడా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
బీస్ట్: తమిళ హీరో విజయ్ ఈ మధ్య తెలుగులో కూడా వరస విజయాలు అందుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లుగా ఈయన సినిమాలు ఇక్కడ అదిరిపోయే వసూళ్లు సాధిస్తున్నాయి. తుపాకి, జిల్లా, పోలీసోడు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. అదిరిందితో తొలిసారి తెలుగులో కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసాడు. ఆ తర్వాత సర్కార్, విజిల్, మాస్టర్ లాంటి సినిమాలతో ఈయన వరసగా విజయాలు అందుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన నటిస్తున్న బీస్ట్ సినిమా సైతం సంక్రాంతికే విడుదల కానుంది. మొన్న సంక్రాంతికి భారీ పోటీ మధ్య విడుదలైన మాస్టర్ మంచి విజయం సాధించింది. బీస్ట్ తెలుగులోనూ 13 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
బంగార్రాజు: నాగార్జున మరోసారి పండక్కే వస్తున్నాడు. ఈయన కమిట్ అయిన బంగార్రాజు సినిమా ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాలేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పక్కాగా ఉంది. మరోవైపు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఒక్కసారి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఇందులో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయనున్నట్లు నాగార్జున కన్ఫర్మ్ చేసాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ ఇది. రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించలేదు.
ఎఫ్ 3: వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలా..? 2019 పండక్కి వచ్చి కడుపులు చెక్కలు చేసింది ఎఫ్ 2. ఆ పండక్కి మరో మూడు సినిమాలు వస్తే వాటన్నింటిని తొక్కేసి విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం. దాదాపు 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపింది ఎఫ్ 2. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు అనిల్. ఎఫ్ 3 పేరుతో ఇది వస్తుంది. షూటింగ్ కూడా 60 శాతం పూర్తైపోయింది. దీన్ని ముందు ఆగస్టులో విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా కుదర్లేదు. దాంతో వచ్చే ఏడాది పండక్కి సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఖరారు చేసారు. మొత్తానికి క్రిస్మస్ టూ సంక్రాంతి.. ఈ 25 రోజుల గ్యాప్‌లోనే దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. విడుదల తేది ప్రకటించలేదు.
మొత్తంగా సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటికే విడుదల తేది షెడ్యూల్ చేసుకున్న సినిమాలు తమ విడుదల తేదిలు మార్చుకుంటాయా.. అదే డేట్స్‌లో విడుదల చేస్తారా అనేది చూడాలి. మొత్తంగా సంక్రాంతి బరిలో చివరకి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (Twitter/Photo)