బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌గా పేరు గాంచిన సంజయ్ దత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈయన ఆఫ్రికన్ దేశాల్లో ఒకటైన టాంజానియా దేశంలోని జాంజిబార్ సినీ రంగానికి పర్యాటక అంబాసిడర్‌గా నియమితులయ్యారు. టాంజానియా దేశం ఆ దేశ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే పనిలో భాగంగా సంజయ్ దత్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాయి. (Twitter/Photo)
ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా భారతీయులే పని చేస్తుంటారు. వీరితో పాటు మన దేశంలోని ప్రజలను అక్కడికి రప్పించే ఉద్వేశ్యంతో సంజయ్ దత్‌ను వాళ్ల దేశానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ చిత్రాలు ఆఫ్రికన్ దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్నాయి. కోవిడ్ మహామ్మారి తర్వాత భారతీయ సినీ దర్శకులు, హీరోలు తమ దేశం వైపు చూడాలనే ఉద్దేశ్యంతో సంజయ్ దత్‌ను సినీ రంగానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సంజయ్ దత్ టాంజానియా ప్రధాన మంత్రిని కలిసిన ఫోటోను షేర్ చేసుకున్నారు. (Twitter/Photo)
టాంజానియా ప్రధాన మంత్రిని కలిసిన తర్వాత సంజయ్ దత్ మాట్లాడుతూ.. చిన్న ద్వీపమైన జాంజిబార్‌లో పెట్టుబడులు, ఆరోగ్యం, విద్యా రంగానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. అందమైన ద్వీప నగరానికి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను గుర్తించి నియమించినందుకు ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు సంజయ్ దత్. (Twitter/Photo)
బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్.. బాలీవుడ్ ప్రముఖ నటీనటులైన సునీల్ దత్, నర్గీస్ కుమారుడు. వాళ్ల నట వారసత్వంతోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. హీరోగా నటిస్తూనే.. పాత్ర నచ్చితే.. ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడడు. తాజాగా సంజయ్ దత్.. కేజీఎఫ్ 2లో అథిరా పాత్రలో ప్రేక్షకులను పలకరించనున్నారు. (Twitter/Photo)
హీరోగా నటిస్తూనే విలన్‌గా టర్న్‌గా తీసుకున్నారు. త్వరలో అధీరాగా KGF 2లో సంజయ్ దత్ కనువిందు చేయనున్నారు. ఈ యేడాది అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘ది భుజ్’ సినిమాలో రా ఏజెంట్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమాతో పాటు సంజూ బాబా చేతిలో ‘షంషేరా’, ‘పృథ్వీరాజ్’, ‘ది గుడ్ మహారాజా’ చిత్రాలున్నాయి. ఆయా చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో ప్రేక్షకులను పలకరించనున్నారు. (Photo : Twitter)
సంజయ్ దత్ కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘ఖల్ నాయక్’. సంజయ్ దత్.. ఇంట్లో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనే టాడా కేసులో అరెస్ట్ అయిన తర్వాత విడుదలైన ఈ సినిమాా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ చిత్రంలోని ‘చోలీకే పీచే క్యా హై’ పాటతో పాటు ’నాయక్ నహీ ఖల్ నాయక్ హు’ పాటలు ఇప్పటికీ సెన్సేషనే. ఇక సంజయ్ దత్ జైలు జీవితం గడిపిన తర్వాత ఇపుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. (Twitter/Photo)